హరివిల్లు రచనలు,;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 186
🦚🦚🦚🦚
తెల్ల దూదిని వడికి 
నూలు దారముతో ఘనత...!
తెల్ల దొరలను పంపి
చరిత మార్చిన జాతిపిత.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 187
🦚🦚🦚🦚 
అరుణాచల శివ
దర్శనమయ్యెను....!
తరుణోపాయముగ
అహమదృశ్యమయ్యెను...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 188
🦚🦚🦚🦚
ఎంగిలి విత్తనాలతో 
పెరగవు కదళీ తరువులు...!
పూజార్హమై దేవుడికి
అయ్యె నైవేద్య ఫలాలు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 189
🦚🦚🦚🦚 
అబద్ధాలు ఆడినచో
ఇహ పర శిక్షార్హతలు....!
సత్య పలుకులు పలికినచో
దేహ పర రక్షార్హతలు..........!!
 
🦚🦚🦚🦚
హరివిల్లు 190
🦚🦚🦚🦚 
విపరీత అపనమ్మికలు
పరాజయపు కారకములు....!
నమ్మికతో ముందడుగులు
విజయపథ సోపానములు.....!!
                       (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు