హరివిల్లు రచనలు,;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 201
🦚🦚🦚🦚
కుదువ పెట్టే మంగళ
సూత్రాలు! కొదువ లేదు...!
ఆకట్టుకొనే అద్భుత 
కట్టడాలు! లోటు లేదు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 202
🦚🦚🦚🦚 
పచ్చిక నేల, ఇసుక పై
నడకలు ఆరోగ్యకరం...!
తదితరములలో ప్రతి
ఒత్తిడై అపాయకరం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 203
🦚🦚🦚🦚
ఎదిగే పిల్లలకు
విలువైన భవనం కన్న...!
తోడు నీడై నిలిచే
సంస్కార కవనం మిన్న...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 204
🦚🦚🦚🦚 
భారతీయుల ఆరోగ్య
సంరక్షణార్థ చర్యలు....!
శతకోటి సంఖ్య దాటెను
కరోన మందు టీకాలు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 205
🦚🦚🦚🦚 
సత్సంకల్పమున గొప్ప
సహకారం అందుతుంది‌..‌!
అహంకారం కలిగిన 
చెప్పక వైదొలుగుతుంది....!!
                       (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు