హరివిల్లు రచనలు,; కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 211
🦚🦚🦚🦚
కనికర గుణం లేని 
సగటు పలకరింపులేల...!
స్వకార్య సాధనలకై
వెగటు ఆలోచనలేల.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 212
🦚🦚🦚🦚 
నూనె వత్తుల దీపపు
వెలుగుల దీపావళి......!
ఆధ్యాత్మిక సంపత్తి 
తలుగుల ఆరావళి.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 213
🦚🦚🦚🦚
వెలిగించిన దీపములు
పోగొట్టును పాపములు.....!
దీప ప్రమిదల వెలుగులు
ఇచ్చును సిరిసంపదలు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 214
🦚🦚🦚🦚 
ప్రభువు తలిస్తే
ఋణ మాఫీ కావొచ్చు....!
విభుడు కరుణ చూపిస్తే
ఋణం తీరి పోవొచ్చు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 215
🦚🦚🦚🦚 
ప్రతి మనిషి గుండెల్లో
సముద్రమంత బాధ.......!
ఆత్మస్థైర్యం కలిగి
పెంచు యిసుమంత మేధ....!!
                       (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు