22.
త్యాగం జీవితం చివరిమెట్టు, మహోన్నతంగా నిలబెట్టు!
త్యాగం బతుకు గుట్టు,
జనం గుండెల్లో గుడికట్టు!
సదాజాతికి ఆదర్శం చూపెట్టు,
జనం భుజం తట్టు!
అందరిని కూడ గట్టు,
సరి త్యాగం బాట పట్టు !
మనిషి త్యాగం నేర్వకుంటే,
తృణం కన్నా తీసి కట్టు!
23.
.*సేవ* మానవత్వ సంచార,
నూతన అవతారం!
మానవ జన్మ ధన్యం,
అసలైన నరలక్షణం!
"సమాజసేవ అంకితం" మరి,
ఉండదు తరతమ భేదం!
ప్రతిఫలాపేక్ష లేని సేవ,
సార్ధక జీవనం బ్రోవ !
సార్ధక జీవనమే,
సాటివారికి చూపుత్రోవ!
24.
సేవ దైవం చిరునామా, నీకు,
తప్పక తెలియాలి సుమా!
జీవించడం సేవించడం ,
ఈ సత్యం మరవకుమా !
సేవకు ప్రతిగా సేవ,
చేయాలనుకోకుమా
ఆర్తులకు సేవ చేయి ,
జన్మ ఋణం తీర్చి వేయి!
దరిద్ర నారాయణా సేవావ్రతం, నారాయణ దర్శనం తథ్యం!
_____________________
రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.;- డా. పివిఎల్ సుబ్బారావు , 94410 58797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి