జీవన సార్ధకత.;- డా. పి వి ఎల్ సుబ్బారావు, 94410 58797
 70.
       రెండు విశ్వయుద్ధాలు,
           మనకు చాల లేదు !
       కరోనా చావుల ,
    అసలు లెక్క తెలియదు! 
     రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,
                 మరి ఆగలేదు!
    యుద్ధోన్మాదం మనిషి,
       ఉనికికే పెద్ద ముప్పు !
   మానవత్వం ఎడల విశ్వం, 
      సవరించుకోలేని తప్పు!
71.
   వస్తువుల ఉత్పత్తుల వెల్లువ! 
 సర్వత్రా విదేశీ కంపెనీల హవా! 
  అమ్మకాలు పెరగడం మినహా! 
సగటు మనిషి జీవితం స్వాహా! 
మన నల్లధనం ,
           విదేశీ బ్యాంకుల్లో,ఆహా!
72.
      భార్యాభర్తల మధ్య ,
                   దాంపత్య సౌరు!
      సంసారంలో పరస్పరం, 
       నిత్యం ఆధిపత్యం పోరు!
       పెరిగే పిల్లలు సైతం ,
            అందులోనే ఆరితేరు! 
     నిత్యం కుటుంబంలో,     
      మాటలపటాసులు పేలు! 
   వయసు మీరిన వారు 
               ఎక్కడెక్కడో చేరు!
_________
రేపు కొనసాగుతుంది.
.

కామెంట్‌లు