ఆనందహేలలు!;- డా. పి వి ఎల్ సుబ్బారావు, 94410 58797..
నా పంచ పదుల సంఖ్య---

1031.
     చెరసాల, దేవకివసుదేవుల,
                 పుత్ర జననము !
    
   రోహిణినక్షత్రం, అష్టమితిథి,
          చేసుకున్న పుణ్యము !
    
   రాత్రికి రాత్రి శిశువు కాళింది,
                దాటిన వైనము!
  
    రేపల్లె ,యశోదా నందుల,   
      ముద్దుల బిడ్డడవడము!
 
 నందకులం, అద్భుతబాల్యం,,
 కృష్ణలీలలసౌందర్యం,పివిఎల్!

1032.
అవతార ప్రయోజనం,
 శిశువుగా దుష్ట సంహారము! 

కంసుడు పంపిన అసురులు,  
        సురలోక పయనము!

విషంపాలివ్వ పూతన ,
అరనిమషం పొందె మోక్షము! 

గోవర్ధన శైల ధారణం ,
      కరి కలువెత్తే చందము !

ఎవరికి పట్టుబడడు ,
     అమ్మ చేత కట్టబడ్డాడు,   
                          పివిఎల్!

1033.
 గోపికా వస్త్రాపహరణం ,
కృష్ణ మాన సంరక్షణము!

చల్దు లారగింపు ,
కాపరియై పశువులపాలనము!

మధుర పయనం ,ప్రసాదించే ,
కుబ్జకు  ,ఏమి అందము! 

 చాణూర కంసుల వధ, 
    ఉగ్రసేన పట్టాభిషేకము !

దేవకి వసుదేవ చెరసాల విముక్తి చేయడము, పివిఎల్!

1034.
మురళి మోవీపై, విశ్వమంతా, నింపే మధుర గానము !

చర్నాకోల అశ్వాల అదిలిస్తూ,   
    విజయ సారధ్యము,!
 
వెన్న ,మన్ను సమానము,
 రవ్వ పాండవ పక్షపాతము! 

కురుక్షేత్రం గీత బోధన,
        జరిపే ధర్మసంస్థాపన! 

నాటిపార్ధునికే కాదు ,
నేటి పార్ధులకు గీచె గీత,
పివిఎల్!

1035.
మాయకుమాయ, ప్రేమకోసీమ,
దైవ కృష్ణావతారము!

 సాందీప శిష్యుడు ,సదా ,
వందే జగద్గురుం విదితమే!

 సత్య ధనం కాక తూచెగా, రుక్మిణి తులసి దళము!

 గోవింద నామ స్మరణం,   
      సర్వజన భవతరణము!

 సాధారణ బోయ బాణము,  
  సమాప్తం అవతారము,   
  పివిఎల్!
_______________________


కామెంట్‌లు