జీవన సార్ధకత.;- డా.పి.వి.ఎల్. సుబ్బారావు, 94410 58797.
 19.
   ప్రేమ బతుకు శ్వాస,
 మనిషిని నిలబెట్టే వెన్నుపూస!   
 
 ప్రేమ హృదయం మణిపూస,
              మనసు వెన్నపూస !
  ప్రేమ, సమున్నత వ్యక్తిత్వ,
    పోత పోసి బంగారు మూస!     
  మానవత్వం కవితకు,
         ప్రేమే అంత్యానుప్రాస!
 
మన అంతిమ ప్రయాణానికి,
            ప్రేమే అసలు వీసా!
20.
     ప్రేమ మానవ సహజం,
              వయసున ఆవేశం! 
   వయసుడిగిన అభిమానం,
             సరి జీవన బంధం!
 
  ఈ జీవన బంధం రాబోయే, 
        జన్మలకు అనుబంధం! 
అంతర్నేత్రం, చూడాలని ఆత్రం,
                బతుకు సూత్రం !
మారని సంతకం, వ్రాయని,   
     జాతకం ,తరగని పంపకం!
21.
  త్యాగం అమృత తత్వం,
    మానవత్వ నిజ పరిమళం !
   అమరవీరుల త్యాగఫలం,
         మన స్వాతంత్ర్య వరం !
  అమ్మానాన్నల అహర్నిశల,     త్యాగం మన జీవన అస్తిత్వం! 
   సజ్జనుల నిర్మల త్యాగం,
           సహజీవన ఆధారం!
 నిత్యం శ్రమజీవుల సుఖ, త్యాగం అభ్యుదయ మూలం!
_______________________


కామెంట్‌లు