జీవన సార్థకత.;- డా. పి వి ఎల్ సుబ్బారావు,9441058797.
       61.
     ఆరోగ్యం మహాభాగ్యంగా,
    పొందాలి!
   ఆయువు మార్కండేయ,    
    సమంగా ఉండాలి!
   ఐశ్వర్యం కుబేరుడు కంటే,
    అధికం కావాలి!
   జీవితాన ఇలలో,
     స్వర్గం నిలవాలి ,సరే!
 మనిషి పావనంగా బతికితేనే ,
"మనిషి తనం" , తెలుస్తుంది!
62.
     సత్యమే వచించు,
        ధర్మమే ఆచరించు!
    మానవత్వ పోషక చర్యలు,
                     ఈ రెండే!
 
   అన్యం ఎన్ని ఉన్నా,
             అవి ఆర్భాటమే!
విషయం,' గ్రహిస్తే చాలు,
                 జన్మ ధన్యమే!
  నీవు మనిషైతే చాలు,
           జనం సంతోషమే!
63.
     మనిషి చేయకూడనిదే,
                           పాపం !
  
   తప్పక ఆచరించ వలసినది,   
                           పుణ్యం!
 
     బతుకున అమానవీయం,   
                            పాపం!
 
   మానవీయంగా బతకడం,
                           పుణ్యం! 
    మానవత్వాన్ని బతికిస్తే ,
                మహా పుణ్యం!
________
రేపు కొనసాగుతుంది.


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం