67.ఇక్కడ నీవు,ఎన్నాళ్ళున్నా ఏమిటి ?జీవించి నన్నాళ్లు ,చేసినది ఏమిటి?బతకడం, అఃటావా,జంతువుల కన్న నయమా?భూమికి భారంగా,దూలానికి,చెదపురుగై బతకకు!మానవహారాన,రత్నమై ప్రకాశించు!68.ఆ యుగం నుండి,ఈ కలియుగం!ఆది నుండి,వింతల యుగం !చూస్తున్నాంగా,మనం నిత్యం జగం!భోగం రోగాల,అత్యంత ఐకమత్యం!ఆపైన అన్ని వదిలి, గమ్యం,తెలియని ఒంటరి ప్రయాణం!69.అకృత్యాల అగ్నిగుండం,ద్వేషాల ఆజ్యం!పగలమారణహోమాలు,పంతాల సమిధలు!పరస్పరం అనుమానం ,క్రోధం కొలమానం!అసహనం అనుక్షణం,అశాంతి తో" రణం !"మంచి", మబ్బు,తేలిపోతుంది,నిలవదు!_________రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.;- డా. పి వి ఎల్ సుబ్బారావు, 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి