గురువు ;- .... వడిచర్ల సత్యం-మణిపూసల రూపకర్త-తాండూర్-9441350137
05 సెప్టెంబర్ గురుపూజోత్సవం సందర్భంగా
మణిపూసల రూపకర్త వడిచర్ల సత్యం రాసిన 
జడ్.పి.హెచ్.ఎస్ గోటిక  ఖుర్డు తెలుగు భాషా పండితులు

వెంకట్ మొలక ప్రత్యేక ప్రతినిధి 
----------------------------------------------------
           
త్యాగమూర్తియే గురువు
జ్ఞానయోగియే గురువు
లోక రక్షణకు తపించు
దైవదూతయే గురువు!

సూర్యుడిలా వెలుగుతాడు
జ్ఞానసుధను పంచుతాడు
శిష్యులకు నిజగురువు
నీడ వలెను మారుతాడు!

అజ్ఞానము దొలగించి
విజ్ఞానము నందించి 
దారిని చూపించు గురువు
నీ ప్రగతిని కాంక్షించి!

తల్లిగాను తండ్రిగాను
ప్రియమైన మిత్రుడిగాను
తోడ్పడును స్వచ్ఛగురువు
శిష్యులకు దేవుడిగాను!

ఇల వెలసిన వేదాలకు
సారస్వత నాదాలకు 
వందనాల కృతజ్ఞతలు
గురుదేవుల పాదాలకు!



కామెంట్‌లు