కర్మ బంధం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
పుట్టగానే ఎవరూ విద్వాంసులు కారు పుట్టిన బిడ్డ మాటలు నేర్చుకోవాలి  పెరుగుతున్న వయసు కొద్ది అక్షరాలు నేర్చుకుని పద ప్రయోగంలో  తన భావాన్ని వ్యక్తం చేయడానికి ముందు సాధన చేయాలి  తన అభిప్రాయాన్ని వాక్యంలో  ఎలా చెప్పాలో  ఆ పదాలను ఎలా వాడాలో అన్ని ఒక్కసారి తెలియవు  సాధన చేయాలి ఈ సాధన మొదట తన నుంచి తరువాత గురువు నుంచి ఆ తర్వాత సన్నిహితులను గురించి తాను నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఆ నిర్మాణం తెలిసిన తర్వాత కానీ అతను వాక్యాన్ని చెప్పడానికి కానీ రాయడానికి కానీ అవకాశం లేదు  అలా చేస్తున్న కొలది  అనుభవం పెరిగి  తాను చెప్పదలచు కున్నది చేయదలుచుకున్నది సరైన పద్ధతిలో  చేయడానికి  పరిణతి చెందిన వాడు అవుతాడు. నిత్యం మనం ఆహార పదార్ధంగా వాడే  కందులు మినువులు లాంటిది  చివరకు ఒడ్లు కూడా గింజతో పాటు పైన పొట్టు కూడా ఉంటుంది  ఆ పొట్టును తీసిన తర్వాత కదా ఆ గింజలు వాడడం  వడ్ల నుంచి  బియ్యం వస్తే వాటిని అన్నం వండుతుంది ఇంటి  ఇల్లాలు  ఆ పై పొట్టుతో సహా తీసుకొస్తే  ఆ పైన ఉన్న ఊకను ఆమె ఏం చేస్తుంది  తానైనా శుభ్రం చేసి ఆ పై పొట్టును తీసివేసి  దానిలో ఎలాంటి వడ్లు గడ్డలు లేకుండా శుభ్రం చేసి  ఆ తరువాత వంట పని ప్రారంభం చేస్తుంది  ఎంత ప్రయత్నం  ఎంత కష్టం  ఒక్క మెతుకు వెనుక యెంత కష్టం దాగి ఉన్నది అన్న సత్యం ప్రతి ఒక్కరికి తెలిసినదే  ఇది మిగిలిన వాటికి కూడా  వర్తిస్తుంది  దానిని వేదాంత భాషలో చెప్పడానికి ప్రయత్నం చేశాడు వేమన. ప్రతి మనిషికి కర్మ బంధాలు ఉంటాయి  ఆ బంధం లేకుండా  ఏ వ్యక్తి ఈ భూమి మీదకు తల్లి గర్భం నుంచి రాడు  వయస్సు తెలిపిన కొద్దీ  ఒక్కొక్క బంధాన్ని వదిలించుకుంటూ  నిర్మలమైన మనసుతో  తాను చేయదలుచుకున్న విషయాన్ని గురించి ఆలోచనలో పడతారు వ్యక్తి  విత్తు పైన ఉన్న  పొట్టు వదిలించడానికి  ఒక గృహిణి ఎంత ప్రయత్నం చేస్తుందో  ఇతను కూడా  కర్మ బంధాలను తొలగించుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేసి తీరాలి  అప్పుడు మోక్షాన్ని గురించి ఆలోచించడం  దానిని సాధించడానికి ఎలాంటి ప్రయత్నంచేయాలో గురుముఖతః నేర్చుకోవడం  తర్వాత సాధన చేసి ముక్తిని పొందడం  ఈ క్రమంలో జరుగుతుంది  అని వేమన తన పద్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు  దానిని చదవండి.

"విత్తును సుముకము తమలో పొత్తున జనియించి పొట్టు బోయిన భంగిన్ తత్వజ్ఞానిని కర్మం బత్తెర గున విడిచిపోవు నవురా వేమా..."కామెంట్‌లు