నేను గుణదలలో లయోలా కాలేజీలో చేరేనన్న మాటే కానీ ఉండేది మాత్రం మాచవరంలో నాతో పాటు మా మాధవరెడ్డి పుల్లారెడ్డి అంతా కలిసి ఒక రూములో ఉంటాం దాదాపు మా గ్రామం నుంచి వచ్చిన కాలేజీ వారంతా దాదాపు ఒకచోటే ఉన్నాం సాయంత్రం అయ్యేసరికి సరదాగా కాలక్షేపం చేయడం పేరయ్య గారి హోటల్ కి వెళ్లి భోజనం చేసి రావటం మా నిత్య కృత్యం మాధవ్ మొదటి నుంచి నాతో పాటు చదివిన వాడే చాలా ఆత్మీయంగా కలిసిమెలిసి ఉంటాం పుల్లారెడ్డి మిగిలిన వాళ్లంతా హలో అంటే హలో అన్న పద్ధతిలో మా స్నేహం ఉంటుంది నేను లయోల కాలేజ్ నుంచి ఎస్ ఆర్ ఆర్ కి వచ్చిన తర్వాత మా స్నేహం మరింత బలపడింది. మేమంతా కలిసి గుణదలలో ఉన్న సమయంలో కమల అన్న పియుసి విద్యార్థిని మా ఇంటి యజమాని కూతురు లతతో కలిసి మేరీ స్టెల్లా కాలేజీలో చదువుతున్నారు వారు కూడా మా ప్రక్క గదిలోనే ఉంటారు కొన్ని రోజులయిన తర్వాత బాగా పరిచయం పెరిగింది నన్ను అన్నయ్య అని పిలుస్తుంది అప్పటికి నాకు వివాహం కావడం అరుణ కమలకు స్నేహం కావడం నా భార్య అరుణ అంటే కమలకు ప్రాణం వదిన అని పిలుస్తోంది ఎప్పుడు సెలవు వచ్చినా ఆమెతో కాలక్షేపం చేయడానికి వచ్చి వెళ్ళేది అలా మా బంధం కుటుంబం బంధం బాగా సన్నిహితమైంది మాధవ్ హైదరాబాద్ వెళ్లాడు కమల నాగపూర్ లో ఎంబిబిఎస్ చదవడానికి వెళ్ళింది ఈ లోపు మాధవ్ ఉత్తరాలు రాయడం మొదలు పెట్టాడు. కమల ఉత్తరాలు రాయవద్దు అని చెప్పింది అయినా తను మానలేదు నా చదువు పూర్తి అయ్యేంత వరకు నేను వివాహం చేసుకోను అప్పుడు కూడా మా పెద్దలు నిర్ణయించిన వివాహమే చేసుకుంటాను తప్ప ప్రేమ వివాహం కాదు నేను అలా చేసుకోను అని ఖచ్చితంగా చెప్పింది వీడు మధ్యలో నాగపూర్ వెళ్లి రావడం ఆమెతో మాట్లాడి రావడం జరుగుతోంది చదువు చివరిలోకి వచ్చిన తర్వాత కమల వాళ్ళ నాన్న నా దగ్గరకు వచ్చాడు మాచవరంలో ఉండగా మీ కులం వేరు మా కులం వేరు ఒకరి పద్ధతులు ఒకరికి నచ్చాలి కదా ఇలా ప్రేమ వివాహాలు అంటే ఎలా కుదురుతుంది అన్నారాయన ఇప్పటినుంచి ఆ విషయాలు దేనికి ముందు వాడి చదువు పూర్తయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నాను.
మన గన్నవరం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి