జీవిత పయనం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 జీవితం మనం ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది. మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి మంచి మార్గంలో వెళ్లడానికి ప్రయత్నం చేస్తాడు. అదే చెడ్డవాడు తన పద్ధతిలో వెళతాడు  సనాతన ధర్మాన్ని అవలంబించే వ్యక్తులు బ్రహ్మీ ముహూర్తంలో లేవడం  తన కార్యక్రమాలను తీర్చుకోవడం  ధ్యానం చేయడం తర్వాత నిత్య కృత్యాలకు  కాలాన్ని కేటాయించడం జరుగుతుంది  ఇది అలవాటుగా చూసినట్లయితే  అది మనకు దూరం కాదు  అలా కాకుండా కొత్తగా అలవాటు చేసుకోవాలి అనుకుంటే  అంత త్వరగా వ్యవహారం కాదు  ఒక ఉపాధ్యాయుడు తరగతిలో పిల్లలకు పాఠం చెబుతూ  ఏ పుస్తకాన్ని చూడకుండా చెప్పగలిగిన స్థితికి వస్తాడు  నిత్యం అతను చేసే పని అదే కనుక  అదే కొత్తవాడికైతే  చాలా సమయం పడుతుంది ఆ పద్ధతి కూడా అతనికి తెలియకపోవచ్చు. ఒక నదిలో నీరు  పుష్కలంగా ఉండి  గాలి సరిగా  వీస్తూ ఉంటే  ఆ నీటి పైన ఉన్న పడవగాని, నావ గాని సక్రమంగా వెళుతుంది  ఒక వ్యక్తి ఎంతో చదివి  పాండిత్యాన్ని సంపాదించుకున్న వాడైనా  అతను ఏ విషయాన్ని గురించి తెలుసుకున్నాడు దానిలో  అతను రాణించగలడు తప్ప  వేరే పని చేయమంటే చేయడానికి  కుదరదు  ఒకవేళ పరిస్థితుల ప్రభావం వల్ల అతను అంగీకరించినా  దానికి పూర్తి న్యాయం చేకూర్చలేడు  అలవాటు లేని ఏ పని అయినా మనం చేయడానికి  వెనకాడక తప్పదు  అదే ముందు  ఆ పని తెలిసిన వారి దగ్గర విషయాన్ని  తెలుసుకొని తర్వాత అతను సాధన చేసి ఆ పని చేయడానికి ఉపక్రమిస్తే  ఆ పని తప్పకుండా జరుగుతుంది విజయాన్ని పొందుతుంది  ఆ పద్ధతిని అందరూ అంగీకరిస్తారు. నేను ఈ పని ఎందుకు చేయలేను  నాకు కూడా తెలుసు అని ముందుకు వచ్చి ఎవరైనా సాహసం చేసిన  అది మాటల వరకే కానీ చేతలలో  అపజయం పొందడం ఖాయం  నదిలో పడవ కానీ నావ గాని ముందుకు నడిచి వెళుతున్న పద్ధతి  ఒకవేళ  ఆ కాలువలో కానీ నదిలో కానీ మీరు ఎండిపోయి  ఇసుక బయటపడినప్పుడు  ఆ ఇసుక మీద ఈ నావ లాగే పడవ గాని నావ గాని నడవ గలదా సారంగు ఎంత  సమర్థుడైన  అసలు వనరులు లేకపోతే  ఆ పని సాగదు  అలాగే ఒక విషయంలో ఎంతో  మంచి పేరు తెచ్చుకునే వ్యక్తి మిగిలిన విషయాలలో ఎందుకు పనికిరాకుండా పోవడం జరుగుతుంది  ఈ విషయాన్ని వేమన తన పద్యంలో చక్కగా వివరించారు  ఆ పద్యాన్ని ఒకసారి చదవండి  సాధన చేస్తే ప్రతీది సాధ్యం కావచ్చు  అన్న విషయం మనకు తెలుస్తుంది.

"నీళ్లలోన పడవలు నిగిడి తిన్నగ బ్రాకు బైట మూరెడైన బ్రాకలేదు నెలవు తప్పు చోట నేర్పరి కొరగాడు..."కామెంట్‌లు