జ్ఞానం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 చిన్నపిల్లలను మనం గమనించినట్లయితే  అక్షరాలు రాగానే ఈ జీవితంలో మనం నేర్చుకోవలసినది మొత్తం మనకు తెలిసిపోయింది  నాకు తెలిసిన అంత విద్య మరి ఎవరికీ తెలియదు అన్న అహంకారంతో ప్రారంభమవుతుంది జీవితం  ఆ అక్షరాలను  మరి కొన్ని అక్షరాలతో కలిపి పదాలుగా ఏర్పాటు చేసి ఆ పదాల సమూహం తో వాక్యాన్ని నిర్మించి  దాని ద్వారా గ్రంథాలను చదివినప్పుడు తన అజ్ఞానం ఏమిటో బయటపడుతుంది  సాహిత్య గ్రంథాలను చదివినప్పుడే అంత ఆశ్చర్యపడే వ్యక్తి  మిగిలిన సాంకేతిక  విశేషాలను తెలియజేసే  గ్రంథాలను చదివితే  అప్పుడు తన స్థితి ఎలా ఉంటుంది  అంత విజ్ఞానులలో  మనం ఎన్నో వంతు  వారు చెప్పినదే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న మన  మేధా శక్తి ఎంత పెరగాలి అని ఆలోచన ప్రారంభం అవుతుంది. లక్షల పద్యాలు చదివిన  అనుభవం ఉండవచ్చు  దానివల్ల ఏమిటి ప్రయోజనం పోతనామాత్యులు భాగవతం లో  ప్రహ్లాదుని ద్వారా చెప్పిస్తాడు  చదువులలోనే మర్మమెల్ల  డెలిసితి తండ్రి  గురువులు సర్వం నాకు తెలిసేలా చెప్పారు అని  గురువు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తాడు  ఆ స్థితి ఎన్ని పద్యాలు నెమరు వేస్తే తెలుస్తుంది  మన ఎదుట ఉన్న  వస్తువును చూచి దానిని విశ్లేషించలేని స్థితిలో ఉన్న మనం  వారి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మార్గం  వెతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది  తాను ఇంతవరకు చదివిన చదువు నిరర్థకం అని అతనికి తెలిసి వస్తుంది  అప్పుడు ప్రారంభమవుతుంది నిజమైన చదువు  దానిని తెలుసుకున్నప్పుడు మాత్రమే వ్యక్తి జ్ఞాని అవ్వడానికి అవకాశం  ఉంది అంటాడు వేమన. శంకరుడు అన్న శబ్దంలోనే మనకు శుభాలను  మంచిని కలిపి చేసేవాడు అన్న అర్థం  దానిలో దాగి ఉన్నది అన్న విషయం తెలిస్తే  ఇన్ని గ్రంథాలు చదవవలసిన అవసరం ఎందుకు వస్తుంది  కంటికి కనిపించిన వస్తువును కూడా గుర్తుపట్టలేని మన అజ్ఞానం వల్ల  చీకటిలో చిందులు వేస్తూ  నాకు అన్నీ తెలుసు అన్న  బ్రాంతిలో మానవుడు జీవిస్తున్నాడు  నీకు శుభాలు కలుగ చేస్తాను అని ఎదురుగా వ్యక్తి మీకు కనిపించినప్పుడు  శివా అని మనస్ఫూర్తిగా వారి నామస్మరణ చేయలేని నీకు  మోక్షం ఎలా సాధ్యం  అని ప్రశ్నిస్తున్నాడు వేమన  శివ అన్న రెండు అక్షరాలను ఉచ్చరిస్తే చాలు ఆత్మ శుద్ధి పొందుతుంది  అని వేమన మనకు తెలియజేస్తున్న పద్యాన్ని ఒక్కసారి చదివితే  మనకు ఆ దర్శనం ప్రాప్తిస్తుంది  వేమన రాసిన ఆ పద్యాన్ని చదవండి.

"అక్షరపుటముల జొర వేలక్షల జదువంగనెలా లాలితముగా ప్రత్యక్షముగాను శివయను రెండక్షరములు మదికి సిద్ధి యగురా వేమా..."


కామెంట్‌లు