చెట్టు కాయ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఏదైనా ఒక పండును మనం తినాలనుకుంటే  అసలు ఆ పండు  ఎలా వచ్చింది దానికి దాని యజమాని ఎంత కష్టపడి ఉంటాడు  ఏ ఏ పద్ధతుల ద్వారా  ఆ పండు రకరకాలుగా మారి  మనకు లభిస్తుందో తెలుసుకోవాలి ముందు  ఎవరైనా చెట్టుని పెంచాలి అంటే ముందు చక్కటి బీజాన్ని ఎన్నిక చేయాలి  దానిని నాటి దానికి కుదురు చేసి నీరు పోసి  మొక్కగా ప్రారంభమైన దానికి ఒక్క కర్ర కట్టి అది తిన్నగా పెరగడానికి  ఏర్పాటు చేసి దానికి కావలసిన ఎరువులు వేసినట్లయితే  ఆ చెట్టు పెరిగి పూత పూసి పిందెగా మారి  సూర్యకిరణాల వల్ల అది  రంగు మారి మనం తినడానికి అనుకూలంగా తయారవుతుంది  ఒక పండు తయారు కావడానికి దాని వెనుక ఇంత కృషి దాగి ఉంది.
మనం ఆ పండు తింటున్నప్పుడు దాని పరిణామం ఏమిటో మనకు చక్కగా అర్థమవుతుంది జీవితంలో వ్యక్తి కూడా  తల్లి గర్భంలో బీజంగా వచ్చి నవమాసాలు పూర్తయిన తర్వాత  పూర్తి ఆకారం తయారై  ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత తన జీవితంలో చేయవలసిన పనులు ఏమిటో తెలుసుకొని  దానికోసం ప్రయత్నం చేస్తాడు  ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతలు  నిర్వహించడం  ఆ తర్వాత జీవితంలో మనం చేయవలసిన మిగిలిన కార్యక్రమము ఏమిటి  భౌతికంగా మనం చేయవలసిన పనులన్నిటిని సక్రమంగా చేశాం.  ఆధ్యాత్మికంగా చేయవలసిన పనులు ఏమిటి అన్న విషయాన్ని ఆలోచించి  దానికోసం ప్రయత్నిస్తున్న సమయంలో గురువు జ్ఞాపకం వస్తాడు. వారి పాదాలను ఆశ్రయించాలి. వారు ఏది చేస్తూ ఉంటే దానిని చూసి మనం నేర్చుకుని  అసలు మన సంప్రదాయం ఏమిటి మనం ఏం చేయాలి  గురువుగారు మనకు బోధించడానికి  ప్రత్యక్షంగా తాను చేసి చూపిస్తున్నాడు అని భావించి దానిని అనుసరించినట్లయితే  అంతవరకు అజ్ఞానంతో ఉన్న జీవితం  కాయ పండు కావడానికి సూర్యకిరణాలు ఎలా ఉపయోగపడతాయో  అలా తాను విజ్ఞాని కావడం కోసం  సూర్యకిరణాల లాంటి  జ్ఞానాన్ని ఉపదేశించే గురువును సూర్యునిగా భావించి  మన ప్రయత్నం మనం చేస్తూ సాధన పూర్తయిన తర్వాత  అప్పుడు పంటకు వచ్చిన పండు ఎంత  పరిణతి చెంది తీపిని అందిస్తుందో  అంత సుఖాన్ని ఈ యోగం  నీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు వేమన వారు రాసిన పద్యాన్ని చదువుదాం.

"చెట్టు నందు బుట్టి చెలరేగు కాయలు తనరు కాంతి తోడ  దవిలి పండు పండు దినుచుకాయ  వర్ణంబు దెలియుడి..."


కామెంట్‌లు