పిసినారి తనం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం9492811322.
 జీవితంలో ఏ వ్యక్తికైనా ఆశ లేకుండా ఉండదు  అందుకనే మనిషిని ఆశాజీవి అని చెప్తూ ఉంటారు మన పెద్దలు  ఆశ లేకపోయినట్లయితే  ఏ సంపాదన లేకుండా  ఒక యోగి లాగా ముని వలె ఒక మూల కూర్చుని  తపస్సమాధికి వెళ్ళవచ్చు  కానీ నిత్యం  కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత అతనిపై ఉంటుంది కనుక  తప్పకుండా సంపాదన ఉండి తీరాలి  ఎలా సంపాదిస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు  ఆ సంపాదించినది తన కుటుంబానికి ఎంతవరకు సరిపోతుంది  ఇంకా ఎక్కువ సంపాదిస్తే మరి కొంత సుఖాన్ని పొందవచ్చు కదా అని ఆలోచించే వ్యక్తులు చాలా మంది  మనకు కనిపిస్తూ ఉంటారు  ఆ సంపాదించిన దానిలో మరికొంత వెనక వేసుకుని  రేపటి కోసం జాగ్రత్త పడే వాళ్ళూ ఉన్నారు.
ఎప్పుడైతే కొంచెం కొంచెం వెనక వేసుకొని  నాలుగు డబ్బులు కంటికి కనిపించాయో  అప్పుడు కొంచెం ఆశ పెరిగి మరికొంత సంపాదించాలని  దానిని బ్యాంకులో వేసి  లేదా తెలిసిన వారికి ఇచ్చి వడ్డీలతో మరియు కొంత సంపాదించవచ్చును అన్న అభిప్రాయంతో  సక్రమమైన మార్గంలో కాకుండా  అందరికన్నా అధిక వడ్డీలకు ఇచ్చి  ఎక్కువ ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు  ఆ వచ్చినధనాన్ని తాను అనుభవిస్తే  తనకు లేకుండా పోతుందన్న అభిప్రాయంతో  కడుపు కట్టుకొని  సంపాదనపై మొగ్గు చూపుతాడు  భార్యా పిల్లలు ఏవైనా కావాలి  అవసరమైన వాటికి కూడా ఖర్చు చేయకపోతే ఎలా అని  అడిగితే నా దగ్గర డబ్బు లేదు  వచ్చిన తర్వాత చూద్దాం లే అంటూ  కాలక్షేపం చేస్తాడు.
అలాంటి లోభులను గురించి  వేమన అనేక పద్యాలలో అనేక పద్ధతులలో వాటిని వ్యాఖ్యానిస్తూ  మంచి మంచి ఉదాహరణలను కూడా మనకు అందించాడు  అలాగే ఈ లోతుని గురించి  ఒక విషయాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాడు  సామాన్యంగా కొంతమంది రైతులు  పంట  పండే సమయంలో  ఒక ఆవుని కానీ మరి ఏదైనా  ఆకారాన్ని  ఏర్పాటు చేసుకొని దానినిచేనిలో  ప్రతిష్టిస్తారు అది చూసి కొన్ని జంతువులు  కొన్ని క్రిమి కీటకాలు రాకుండా పోతాయని అతని అభిప్రాయం  ఇలాంటి వ్యక్తులను చూసే మన పెద్దవారు  వాడు తినడు ఇంకొకరికి పెట్టడు  ఎదుటివారి డబ్బుతో వారు తింటున్న వీడు సహించలేడు  అని అతనిని ఎద్దేవా చేయడం మన వింటూనే ఉన్నాం  వేమన రాసిన ఈ పద్యాన్ని చదవండి.

"తాను గుడవ లేక తగవేదియాప్తుల జేరనివ్వడట్టి చెనటి  గోవుచేని లోక బొమ్మ జేసి కట్టిన యట్లు..."


కామెంట్‌లు