ఆది లోనే అంతం చేయాలి ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ జీవి భూమి మీదకు వచ్చిన తరువాత  ఆనాటి రాతియుగంలో వ్యక్తులు  ఎలా ప్రవర్తించారు ఎలా తమ ఆకలిని తీర్చుకున్నారు  ఎక్కడ తమ గూడును నిర్మించుకున్నారు ఎలా వారి జీవనం సాగిందో  ఎక్కడో పుస్తకాలలో చదవడం తప్ప ఏ ఒక్కరికి ప్రత్యక్ష పరిచయం లేదు  ఆ స్థితి నుంచి నేడు నాగరికంగా ఎంతో పెరిగాం అనుకుంటున్న ఈ స్థితి వరకు  సంసారం లేదా కుటుంబం ఎందుకు  అని మనలను మనం ప్రశ్నించుకున్నట్లయితే సంతానోత్పత్తి కోసం  అన్న సమాధానం రాక తప్పదు  ఎప్పుడైతే ఆ సమాధానం మనకు దొరికిందో  అప్పుడు ఆడపిల్లలు మగ పిల్లల కోసం  పురుషులు స్త్రీల కోసం వెతకడం ప్రారంభమవుతుంది  ఆ రెండు మనసుల ప్రవర్తనలను అర్థం చేసుకున్న తర్వాత  వాడి బంధం వివాహంతో ముడి పడిపోతుంది. స్త్రీ పురుషుల జీవితం ప్రారంభమైన తర్వాత  నిజానికి ఎవరి అభిప్రాయాలు వారికే ఉంటాయి  ఇద్దరూ రెండు కుదుళ్ళ నుంచి వచ్చినవాడు  రెండు కుటుంబాలు వేరువేరు పద్ధతులలో  జీవించి  ఉంటాయి  ఎవరు చేసిన పని వారికి చాలా గొప్పగా ఉంటుంది  ఇప్పుడు ఇద్దరూ కలిసి కాపురం చేస్తున్న సమయంలో  ఎవరి పద్దతిని ఎవరు అనుసరించాలి  స్త్రీ పురుషులలో ఎవరు ఆధిక్యత  ఎవరు చెప్పినది ఎవరు వినాలి  నిజానికి ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నప్పుడు రెండవ అభిప్రాయం చెప్పినప్పుడు అది నచ్చదు  అలాంటప్పుడు ఒకరి మాట ఒకరు ఎలా వినగలుగుతారు  అక్కడ ప్రారంభమవుతుంది కుటుంబంలో జగడం  అభిప్రాయభేదాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఎడ మొహం పెడ మొహం.
అలాంటి స్థితి  పాకానపడి ముదిరిపోకముందే  ఇద్దరూ సమన్వయంతో  ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది  అన్న ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు  ఆ సంసారం సజావుగా జరుగుతుంది  లేకుంటే నేను నా భార్యను అదుపులో పెట్టలేకపోయాను అని అతను  జీవితంలో ఎంతో కుమ్మిడిపోతూ ఉంటాడు  అలా కాకుండా మొదట్లోనే  ఒక పద్ధతిలో మాట్లాడి తనను వశం చేసుకుంటే ఆ బాధలు ఉండవు  దానికి ఉదాహరణగా వేమన చెబుతున్న విషయం  మనం ఒక చెట్టుని  పెంచాలనుకున్నప్పుడు  అది లేతగా ఉన్నప్పుడే  నిటారుగా తిరిగేలా  ఏర్పాటు చేసుకోవాలి తప్ప  ముదిరిన తరువాత  అది వంగుతుందా అని ప్రశ్నిస్తున్నాడు వేమన  ఆ పద్యాన్ని చదవండి.

"ఆలి వంచలేక యథమత్వమున నుండి వెనక వంతుననుట వెర్రితనము  చెట్టు ముదరనిచ్చి చిదిమిన బోవునా..."


కామెంట్‌లు