మన గన్నవరం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ముక్కామల నాగభూషణం గారు  ముక్కామల అంటే సినీ నటుడు అన్న అభిప్రాయం రావచ్చు చాలామందికి వీరు విశాలాంధ్రలో చాలా రోజులు పనిచేశారు.  చక్కటి వాక్చాతుర్యం కలిగిన వారు  మంచి నాటకాలు వ్రాసే సత్తా కలిగిన రచయిత  ఏదైనా ఒక వ్యాసం రాస్తే  ఏ విమర్శకుడు వేలెత్తి చూయించలేని పద్ధతిలోనే వ్రాస్తాడు  పెద్దవాళ్లలో పెద్దవారుగా చిన్నవాళ్ళలో చిన్నవారులా సాహితీ మిత్రులతో  సాహిత్యాన్ని గురించి మాట్లాడగలిగిన స్థాయి కలిగిన వ్యక్తి  తర్వాత ఆర్థిక భూమి అనే పత్రికను స్వతంత్రంగా ప్రారంభించారు  ఆయనకు పుస్తక సాల కూడా ఉంది  తరువాత ఆయన మేనల్లుడు వెంకటప్పయ్య గారికి అప్పగించి  ఆయన ప్రగతి పేరుతో వార పత్రికను ప్రారంభించి  చక్కటి వ్యాసాలను ప్రచురిస్తూ కొత్త రచయితలను  ప్రోత్సహిస్తూ ఉండేవారు. 1974 సంవత్సరంలో  ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వారు  దేశంలో ఉన్న అన్ని కేంద్రాలలో ఉత్తమమైన  రచనలు చేయడానికి  మంచి కార్యక్రమాలు వినిపించడానికి  చక్కటి ప్రణాళికను ఏర్పాటు చేసి  అందరినీ  ప్రోత్సాహపరచడానికి  ఒక నాటకం ఒక రూపకం ఒక సంగీత రూపకం  అంటూ మూడు విభాగాలలో బహుమతులను ఏర్పాటు చేశారు  దీనిలో భాషా భేదం లేదు  శ్రీ గోపాల్ గారు విక్రాంత గిరి శిఖరం  రజనీ గారు కొండ నుంచి కడలి దాకా  వ్యవసాయదారుల కార్యక్రమంలో నాటకాలు ప్రసారంచేసే అలవాటు లేదు  అలాంటిది బహుమతులు అనేసరికి వై హనుమంతరావు గారు కూడా  తమ వ్యవసాయ  శాఖ నుంచి ఒక నాటకాన్ని  ఇస్తామని చెప్పారు. ఆ విషయాన్ని గురించి హనుమంత రావు గారు  ముక్కామల గారికి తెలియజేస్తే  ఎన్ని రోజుల్లో కావాలి అని అడిగారు మీరు ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా నాటకం చేస్తామని చెప్పారు హనుమంతు రావు గారు  రెండవ రోజు గంట నాటకాన్ని తీసుకువచ్చి  పసిడి పంటలు అన్న పేరుతో  హనుమంతు రావు గారికి ఇచ్చారు  దానిలో నేను ప్రధాన పాత్ర వహించి  దర్శకత్వ బాధ్యత కూడా తీసుకున్నాను  అందరూ కొత్త నటీనటులనే ఎన్నుకున్నాను  ఆకాశవాణి కి మొదటి నాటకంగా భీమవరం నుంచి వచ్చిన  రుక్మిణి అన్న  రంగస్థల నటిని ఎంపిక చేశాం  చక్కటి నటన అందించింది  మూడు నాటకాలు ఢిల్లీకి పంపించిన తర్వాత  భారతదేశంలో ఉన్న ఆకాశవాణి కేంద్రాలలో  పేరు సంపాదించుకున్న కేంద్రం ఒక్క విజయవాడ  అని ఢిల్లీ కేంద్రం నుంచి  డైరెక్టర్ జనరల్  సమాచారం ఇచ్చారు.కామెంట్‌లు