మేధావి మరుపూరు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 మరుపూరు కోదండరామిరెడ్డి గారు తల నిండుగా ధోవతి మోచేతుల వరకు చొక్కా పై పంచి ఎప్పుడు నవ్వు మొహంతో గంభీరమైన భాషణ  చాలా విషయాల్లో సమకాలీనుల కన్నా చాలా ముందు ఉండేవారు  ఎంత కొత్త వారైనా వారిని చూడగానే  గౌరవభావం పుట్టుకొస్తుంది  రెండు చేతులు ఎత్తి వారికి నమస్కరించాలనిపిస్తుంది  అవతలి వారు పెద్దవారా చిన్నవారా అని చూడరు అందరితోనూ ఎంతో స్నేహభావంతో  వారు ఏ విషయంలో నిష్ణాతులో ఆ విషయాన్ని గురించి మాట్లాడడానికి  ఆయన ఎప్పుడు సుముఖంగానే ఉండేవారు. ఎవరిని నొప్పించకుండా తన అభిప్రాయాలు ఏమిటో చక్కగా  తులనాత్మకంగా చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన  సాహితీ వేత్త మరుపూరు కోదండరామిరెడ్డి గారు.
ఆ రోజుల్లోనే వారి ఇంట్లో మర్ఫీ రేడియో ఉండేది ఆ  వీధులో ఉన్న బాలలందరూ ఆదివారం  పిల్లల కార్యక్రమం వినడానికి  వారింటికి గుంపుగా వచ్చేవాడు  వారికి ఎక్కడ విసుగు కనిపించేది కాదు  కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పిల్లల్ని ఆ కార్యక్రమాల గురించి ప్రశ్నలు అడిగేవారు  వారిలో బాగా సమాధానాలు చెప్పిన వారికి  చాక్లెట్లు కూడా పంచేవారు.  తండ్రి  కొండయ్య తల్లి కామమ్మ  తల్లిదండ్రులంటే వారికి ఎంతో పూజ్య భావం వారు కట్టిన ఇంటికి కామగిరి  అని పేరు పెట్టారు  గిరి అంటే కొండ  కామమ్మ తల్లి పేరు  ఇద్దరి పేర్లు కలిసి వచ్చేట్టుగా  ఇంటిపేరు పెట్టడం వారి సౌజన్యానికి  గుర్తు  చివరి వరకు తల్లిదండ్రులను  జన్మనిచ్చిన బ్రహ్మ రూపంగానే భావించేవారు. నిజానికి రెడ్డి గారు ప్రకృతి ప్రేమికుడు  1960 ప్రాంతంలో జేమ్స్ గార్డెన్స్ లో విలక్షణంగా అపర్ణ అనేది పెట్టారు  ఆ పేరు ఎందుకు ఎన్నుకున్నారు అని అడిగితే  శివుడు తపస్సు చేస్తున్నప్పుడు  చుట్టూ ఉన్న ఎండుటాకులు  శబ్దం చేస్తాయి. ఆయనకు  ఏకాంతం లోపిస్తుంది అన్న అభిప్రాయంతో  పార్వతీదేవి ఆ ప్రాంతంలో ఉన్న  ఆకులనన్నిటిని పోగుచేసి దూరంగా పారవేసింది కనుక ఆమెను  అపర్ణ అని పిలుస్తారు  ఆది శంకరులు  స్త్రీ పురుషులు  పెళ్లి అయిన తర్వాత వేరు వేరు కాదు ఇద్దరు ఒకరే  అన్న అర్థం స్ఫురించేలా  అర్ధనారీశ్వరుడై  తనకు ఎంత  హక్కు ఉన్నదో అంత హక్కును పార్వతీదేవికి ఇచ్చి గౌరవించిన వ్యక్తి  ఆ రోజుల్లోనే స్త్రీని చులకన చేయకూడదు అన్న  జ్ఞానాన్ని  ప్రజలకు ఇచ్చిన మహానుభావుడు  కనక  వారి పేరును నేను వాడుకున్నాను అన్నారు.
కామెంట్‌లు