శాంతము లేక సుఖము లేదు అంటాడు త్యాగరాజ స్వామి జీవితంలో రాముని ఆరాధన తప్ప మరొక ధ్యేయం ఆయనకు లేదు ఆయన శాంతం కలగడానికి చెప్పిన మార్గం శత్రువులను లేకుండా చేసుకోవాలి అని నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు మాటకు మాట పెరిగి శత్రుత్వాలు బలమై జీవితంలో ఒకరినొకరు హత్య చేసుకునే స్థితి వరకు పెరుగుతుంది కనుక అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు నిన్ను నీవు అదుపులో ఉంచుకున్నట్లయితే ఇలాంటి అవాంతరాలు రావు అని మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటే అయితే వేమన చెప్పదలుచుకునే విషయం అదేనా అన్నది ఒక్కసారి ఆలోచించినట్లయితే సమాధానం దొరుకుతుంది. ఏ వ్యక్తికీ తాను పుట్టగానే శత్రువులు ఏర్పడరు అని కొంతమంది అంటారు కానీ పుట్టుకతోనే ఆరు రకాల శత్రువులు మనలో ఆవరించి ఉంటాయి ఆ శత్రువుని జయించాలి అంటాడు వేమన ఎవరయినా పరుషంగా మాట్లాడినా దానికి అనవసరమైన కోపతాపాలు తెచ్చుకోకుండా ప్రశాంతంగా వింటూ కూర్చుంటే ఎలాంటి బాధలు ఉండవు నాకు అది కావాలి ఇది కావాలి అంటూ కోరికలను పెంచుకుంటూ జీవితాన్ని ఆశలతో ముడి పెట్టకుండా ఉన్నదానితో సుఖంగా జీవితాన్ని కొనసాగించినట్లు అయితే ఏ బాధ ఉండదు కొన్నిటిపైన విపరీతమైన మోహం కలుగుతుంది దానివల్ల మనసు చికాకుపడి అది సాధించలేకపోతున్నానే అన్న బాధతో కృంగి కృషించి పోవడం సహజం ఆ కామాన్ని జయించు అంటాడు వేమన.
వీటిని అన్నిటినీ జయించాలి అంటే ఉన్నది ఏకైక మార్గం ఒకటే సత్యాన్వేషణ ఈ జీవితంలో ఏది సాధించాలని అనుకుంటున్నామో దాని కోసం ప్రయత్నం చేసి అంకిత భావంతో ఉంటే దానిని సాధ్యం చేసుకోవచ్చు దానికి ఏకైక మార్గం శివారాధన వారిని నమ్మి తదేకదీక్షతో వారిపై మనసుపెట్టి తనలో ఉన్న అహం అన్న నేనును జయించినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు అని వేమన తెలియజేస్తున్నారు. ఎప్పుడు సత్యమార్గాన్ని అవలంబించి ఈశ్వర సాక్షాత్కారం పొందుతాడో ఆ క్షణాన నా పుణ్యపురుషునిగా భావించబడటానికి ప్రతి ఒక్కరూ ఆ సాధన చేయాలి అని చెప్తువ్రాసిన పద్యాన్ని ఒకసారి చదవండి మీకే తెలుస్తుంది.
"శత్రువులను దృంచి శాంతంబు వహియించి కృత్యములను నడుపు నిత్యునెరిగి సత్యమణగకుండా సాధించినటువంటి పురుషుడౌను పుణ్యపరుడు వేమ..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి