కొడుకు చాలు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మనిషి జీవితంలో కోరుకునేది  తనకు సిరి సంపద కావాలని  అందం ఉండాలని  పున్నామ నరకం నుంచి తప్పించడానికి కుమారుడు కావాలని  కోరుకోవడం సహజం  అందరికీ అవి అన్ని సాధ్యమవుతాయా  సౌందర్యం రావాలి అంటే  అసలు సౌందర్యం  శరీరానికి సంబంధించిన  దా అనేది మాత్రం ఆలోచించాలి  శరీరానికి ఎంత సొగసు వచ్చిన  అది క్షణికమే తప్ప శాశ్వతం కాదు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు  కానీ దానికోసమే ఎందుకు తహతహలాడుతారో ఎవరికి తెలియని విషయం  ఆ సౌందర్యం ఇనుమడించడం కోసం  రకరకాల ఆహార్యాలతో  లేపనాలతో  మానవుడు ప్రయాసపడతాడు  అంతమాత్రం చేత మనసు ప్రశాంతంగా ఉండకపోతే శరీరానికి అందం ఎక్కడినుంచి వస్తుంది ఎలా వస్తుంది  అన్నది మాత్రం ఆలోచించాలి.
సిరి సంపదలు ఉంటే ఈ జీవితంలో మనకు కావలసింది ఏమీ ఉండదు  అని ఆలోచిస్తూ ఉంటాడే తప్ప  ఆ సంపదను సంపాదించడం కోసం ఎంత ప్రయత్నం చేయాలి  ఎంత కృషి చేస్తే అంత ధనాన్ని అనుకున్నంత సంపదను  పొందగలం  అని మాత్రం మనసుకు ఆలోచన రాదు  సిరి సంపదలు ఉంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమను ఎంతో గౌరవిస్తారు  సమాజంలో పేరు  ప్రతిష్టలు పెరుగుతాయి  అని ఆలోచిస్తారు తప్ప  దానిని ఎలా పొందాలి  వచ్చిన దానిని ఎలా నిలుపుకోవాలి అని మాత్రం  ఆలోచన రాదు  తనకు ఎంత భూమి ఉంటే అంత  గౌరవం పెరుగుతుంది అని అనుకుంటాడు  కానీ అతన్ని మించి  భూమి కలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు  వారందరికీ మంచి పేరు వస్తుందా  అని ఎప్పుడైనా ఆలోచించాడా అంటే అది లేదు. జీవితంలో చదువు ఉంటే ఏదీ అవసరం లేదు  జీవించడానికి కావలసిన ప్రతిదీ  విద్య వల్ల సాధించవచ్చు  అనుకుని ఎన్నో ప్రయత్నాలు చేయడం  అవన్నీ  కుదరక  నిరుత్సాహంతో నిష్కృపతో  జీవితాన్ని నాశనం చేసుకోవడం  చివరకు చదువు చెప్పించుకోవడానికి వచ్చే విద్యార్థుల నుంచి ధనాన్ని సేకరించాలని  అదీ కుదరని స్థితి  కనుక ఈరోజు తల్లిదండ్రులు ఆలోచించేదేమిటి  అందం అవసరం లేదు ఆస్తిపాస్తులు వద్దు  చదువు లేకపోయినా పరవాలేదు  గుణవంతుడైన కొడుకు ఉంటే చాలు  తమ జీవితం  ధన్యం అని ఆలోచిస్తారు  ఆ స్థితికి రావడానికి ఎన్ని అవస్థలు పడవడిసి ఉంటుందో  తన పద్యంలో  వేమన చక్కగా అభివర్ణించారు  ఆ పద్యాన్ని చదవండి.

"చక్కదనములేల   సంపత్కరములేల  విద్య లేల భూమి విరివి యేల పుత్ర పదవి కన్న పుట్టునా పదవులు ..."


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం