మక్కువ పెరిగితే;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఒక వ్యక్తి బజారుకు వెళ్ళినప్పుడు  అంగడిలో కనిపించిన కొన్ని వస్తువులను చూసి మనసు పడి  వాటిని కొనడానికి సిద్ధపడతాడు  ఏదైనా మంచి తీపి పదార్థాల  అంగడి కనిపించినప్పుడు  ఒకే పదార్థంతో చేసిన అనేక రకాల  పిండి వంటలు కనిపిస్తే వాటిలో  తనకు నచ్చిన దానిని ఒకటి కొని ఇంటికి తీసుకొని వెళ్తాడు  అది మంచిగా ఉంటుందా  ఆరోగ్యానికి మంచిదా లేక చెడ్డదా అన్న విషయం ఆ క్షణాన ఆలోచించడు  ఆ పదార్థాన్ని వాడిన తరువాత కానీ అతనికి అస్సలు విషయం తెలియదు  ఇంట్లో గృహిణి కూడా  తనకు నచ్చిన పదార్థాలను  తయారుచేసి  వడ్డనలో కూర్చున్నప్పుడు  పిల్లలు భర్త తింటూ దాని రుచిని ఆస్వాదించి  అది ఎలా ఉన్నదో చెబితే తప్ప ఆమెకు అర్థం కాదు  తనకు నచ్చినది అందరికీ నచ్చుతుంది అనుకోవడం పొరపాటు.
రైతులకు పశువులను పెంచడం  అలవాటు  వాటిని కూడా తమ కుటుంబ సభ్యులగానే ఎంచి  వాటికి కావలసిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు  వ్యవసాయానికి పనికొచ్చే ఎడ్లు  గిత్తలకు  ఉలవలను ఉడికించి  దానిలో కొంతమంది బెల్లాన్ని కలిపి తినిపిస్తారు  అవి ఎంతో ఆనందంతో ఆరగిస్తే  అలాగే గేదలు బర్రెలు ఉన్నప్పుడు  వాటికి కుడితి అన్న పేరుతో  మనం భోజనం చేసిన తర్వాత కలిగిన పల్లెములో  నీటిని వాటికి అందిస్తారు  అవి సక్రమంగా తాగాలి అనుకుంటే రైతు చేసే మొదటి పని దానికి  తవుడు కలపడం వడ్లు పట్టించినప్పుడు  ఊకతో పాటుగా తవుడు కూడా  వస్తుంది  దానిని వేసి  పశువులకు ఆహారంగా  ఉపయోగిస్తారు  దానివల్ల పాల దిగుబడి కూడా పెరుగుతుంది  అది రైతుకు తెలిసిన విద్య.
ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన రుచి  అలవాటు అవుతుంది  తీపి పదార్థాలను తింటూ ఎంతో ఆనందించే వాళ్ళు కొంతమంది అయితే  కారపు సరుకులలో  ఉన్న సుఖాన్ని ఆస్వాదించేవారు మరికొందరు  అంత మాత్రం చేత వారి అభిరుచులను వంక పెట్టగలమా  ఎవరి ఇష్టం వారిది  దీనికి సంబంధించిన ఒక  చక్కటి ఉపమానాన్ని మనకందించారు  తినకూడని తినలేని పదార్థాలను కూడా  తినిపించాలి అనుకుంటే దానికి తగిన  మార్గం ఉంది  తవుడును తినిపించాలి అనుకుంటే  దానిలో చక్కటి బెల్లాన్ని కలిపితే  ఎంతో ఆనందంగా తిని చాలా రుచిగా ఉన్నది అని అభినందిస్తాడు కూడా  ఇలాంటి రహస్యాలను ఎన్నిటిలో మనకు వేమన అందించారు. మక్కువ కలిగినప్పుడు  అనేక మందితో శారీరక సమన్వయం కలిగిన  మహా అందంగా కనిపిస్తుంది చాలా పవిత్రంగా అనిపిస్తుంది అంటాడు వేమన. ఆ పద్యాన్ని చదవండి దానిలోని రహస్యం ఏమిటో కూడా మనకు తెలుస్తుంది.

"చక్కెర గలుపుగ తింటే ముక్కిన తవుడైన లెస్స మోహము గలచో పెక్కురు బానిసే యైనన్ మక్కువతో దివ్యభామ మహిమలో వేమ..."

కామెంట్‌లు