మన గన్నవరం- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 నేను మా గ్రామంలో ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడు  తర్వాత లైలా కళాశాలలో  విద్యార్థి నాయకుల ఎన్నికలలో అన్న మాట వినలేదు  నేను బిఏ లో ఎస్ ఆర్ ఆర్ & సివిఆర్ గవర్నమెంట్  కళాశాలకు వచ్చిన రెండు నెలలకు  ఒక రకమైన హడావుడి కనిపించింది. పది పదిహేను మంది ఒక బృందంగా ఏర్పడి  ఒక్కొక్కరిని కలవడం వారితో ఏవేవో మాట్లాడడం వారంతా బాగా తెలిసిన వారు స్నేహితులు అనుకున్నాను  కానీ ఒకరోజు  నా గురించి తెలుసుకున్న కడియాల రాఘవరావు  నా దగ్గరకు వచ్చి మీది తేలప్రోలు కదా  అంటూ నా గురించిన సమాచారం అంతా తనే చెప్పి  నేను ఫలానా నేను గన్నవరంలో ఉంటాను నేను ఇక్కడే చదువుతున్నాను  ప్రస్తుతం మన కళాశాలలో  విద్యార్థి నాయకుని ఎన్నిక జరుగుతుంది  దానికి మీ సహకారం కావాలి అన్నాడు.
మాటల సందర్భంగా మీరు ఏ పార్టీ అన్నాడు  మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ  మా నాన్న  స్వాతంత్ర్య సమరయోధులు  బెజవాడ గోపాల్ రెడ్డి కాకాని వెంకటరత్నం గారితో జైలుకు కూడా వెళ్లి వచ్చినవాడు  కనుక ఎన్ని పార్టీలు ఉన్నా మా కుటుంబం కాంగ్రెస్ తప్ప మరొక పార్టీ  లో  చేరదు అనేసరికి  రాఘవరావు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచి  ఇక్కడ కమ్యూనిస్టు కాంగ్రెస్ అని రెండు తెగలు ఉన్నాయి  విశాలాంధ్ర తరఫునుంచి కొల్లి నాగేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ అభ్యర్థిని నిలబెడుతున్నారు  మీ గ్రామంలో నుంచి వచ్చిన  బొమ్మ రెడ్డి గారి అమ్మాయి  అరుణ కూడా ఆ పార్టీకే  ప్రచారం చేస్తుంది  నాగేశ్వరరావు అప్పటికే కళాశాల  విద్య పూర్తి చేసి  పార్టీ సభ్యులుగా తిరుగుతున్నాడు  అతని భార్య థన్యా కూడా  ఆ పార్టీ నే అని చెప్పడం  మొదట పెట్టాడు. మనమందరం మంచి వ్యక్తిని చూసి  పార్టీ ప్రమేయం లేకుండా అందరికీ సమానంగా పనిచేయగలిగిన వ్యక్తిని ఎన్నుఉందాం  దానికి మీ సహకారం కావాలి  నరసింహారావు గారని  అందరికీ సహకరించే వ్యక్తి  అతని కోసం మేము అంత ప్రచారం చేస్తున్నాం  మీరు కూడా సహకరిస్తే  మీరు ఇంతకుముందు  హైస్కూల్లో  స్టూడెంట్స్ ఫెడరేషన్ లో పనిచేశారు అని తెలిసింది  దానిలో పనిచేసిన అంత నిజాయితీగా దీనిలో చేసినట్లయితే  మనం తప్పకుండా విజయాన్ని సాధిస్తాం  అన్న తర్వాత  ప్రచారం మొత్తం ఎక్కడ విద్యార్థి ఏ మూల ఉన్నా వారి ఇంటికి వెళ్లి అతని వివరాలన్నీ చెప్పి  దాదాపు అతను మనకు  ఓటు వేసేలా  ఒప్పించి వచ్చేవాళ్ళం  అలా రాత్రింబవళ్లు ప్రచారం చేయడం వల్ల  మేము నరసింహారావును గెలిపించుకో గలిగాం.
కామెంట్‌లు