దరిద్రపు ఆలోచనలు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ ప్రపంచం మొత్తం మీద  భారతదేశపు సంస్కృతీ సంప్రదాయం చాలా గొప్పవి అని మిగిలిన దేశాలన్నీ అభినందిస్తాయి  దానిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తాయి  కానీ మనం మాత్రం  దానిని ఏమాత్రం లక్ష్య పెట్టము అతి చిన్న విషయాలను కూడా ప్రక్కన పెట్టి  ఎలా తినాలో ఎలా తాగాలో ఎలా జీవితాన్ని గడపాలో కూడా తెలియని స్థితి  అభ్యుదయ భావాలను  ఆకళింపు చేసుకున్న  వ్యక్తులు కూడా  సనాతనం అంటే  చిన్న చూపే  ఎందుకు వారు దానిని అనుసరించలేకపోతున్నారు  విషయం తెలియకనా దానిలో ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకోలేకపోవడమా  కారణం వారికి తెలియదు మా భావాలకు అది మూఢ నమ్మకంగా అనిపిస్తుంది  అని కొంతమంది తప్పుకుంటారు.
మనం లేచిన తర్వాత  కాల కృత్యాలు తీర్చుకొని కొంచెం  వ్యాయామం చేసినట్లయితే శరీరం ఎంత తెలివిగా ఉంటుంది ఆ రోజంతా హాయిగా అన్ని పనులు చేసుకోవడానికి ఉపకరిస్తుంది  కానీ మనం లేవడమే ఆలస్యం  ప్రక్కన కాఫీ ఉండాలి  ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది  ఆహారం తీసుకున్నా  సనాతనలు భూమి మీద పద్మాసనం వేసుకుని కూర్చుని  దానిపైనే దృష్టి పెట్టి భోజనం చేసేవారు వారికి ఎలాంటి రుగ్మతలు వచ్చేవి కావు . ఇవాళ మనం సాంకేతికంగా ఎంతో పెరిగిమంచం మీద  కుర్చీ మీద కూర్చుని టీవీ చూస్తూ ఆ ఆనందంలో మైమరిచి భోజనం చేసేటప్పుడు జరిగేది ఏమిటి అని ఒక్కసారి వాళ్ళు ఆలోచిస్తారా కనీసం ముద్ద నోట్లో పెట్టి తర్వాత ఎన్నిసార్లు నమ్మలాలో వారికి తెలుస్తుందా. అలాంటి వారికి ఆరోగ్యం బాగుండాలంటే ఎలా ఉంటుంది  దానిని గురించి మాత్రం ఆలోచించాలి  ప్రభుత్వ రాజకీయాల నుంచి  పరదేశంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు తప్ప  తనను గురించి తాను ఆలోచించే స్థితిలో  ప్రస్తుతం వ్యక్తి లేడు అని చెప్తున్నాడు వేమన  దరిద్ర దశ అనుభవించాలి అది వచ్చినప్పుడు ఆలోచనలు కూడా దరిద్రంగానే ఉంటాయి  ఉదాహరణకు ఒక పులి  పిల్లని పెడితే  దానినే తినే దుస్థితికి అది వస్తుంది  అలాంటి దరిద్రపు ఆలోచన రావడం దానిని ఆచరించడం  ఆ జంతువుకు తగినది  కానీ ఆలోచన చేయగలిగిన వ్యక్తి  తన మంచి కోసమైనా ఆరోగ్యం కోసం అయినా  చక్కటి పద్ధతులను అనుసరించవచ్చు కదా  అంటాడు వేమన ఆ పద్యాన్ని చదవండి.
"లేని కాలమునకు లేని మనమునొందు యీనిన పులి రీతి నెరుగకుండు కటిన బుద్ధి  కిట్లు కలిమేమి గల్గురా..."


కామెంట్‌లు