మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.

 రాఘవరావు లో నేను గమనించినది  మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి  అని. తన ప్రత్యర్థులను కూడా  తన బాటలోకి తెచ్చుకోగలిగిన   నేర్పరి  అతనికి కొన్ని  నియమ నిబంధనలు ఉన్నాయి  తాను అనుకున్న పని చేయడానికి ఎంత కృషి అయినా చేయగలడు  సమాజంలో ప్రతి ఒక్కరికి మేలు చేయడం  అలానే కీడు మాత్రం చేయకూడదు  అని పెద్దలు మనకు చెప్పిన మాటను స్ఫూర్తిగా తీసుకొని  తన రాజకీయ జీవితంలో  అలంకరించిన పదవులను చాలా సమర్థవంతంగా నిర్వహించారు  గన్నవరం నియోజకవర్గంలో  ఏ పదవిలో ఉన్న  ఎవరిని నొప్పించకుండా అందరిని ఒప్పించుకుంటూ ఏ విధమైన అవినీతి ఆరోపణలకు తావు లేకుండా  పదవులలో సమర్థవంతంగా  రాణించగలిగిన వ్యక్తి  మా రాఘవరావు. తన చదువు పూర్తి చేసిన తర్వాత 1983లో రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాడు  1985 నుంచి 1987 వరకు గన్నవరం మండలం తెలుగుదేశం పార్టీ  అధ్యక్షునిగా పనిచేసి పార్టీని పటిష్ట పరిచయడానికి ఎంతో ప్రయత్నం చేశాడు  1987లో మండల పరిషత్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా పార్టీ అధిష్టానం  టిక్కెట్ ఇస్తామన్నా  వద్దని నిరాకరించడంతో  అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు బీఫామ్ పంపడంతో ఎన్నికల్లో పోటీ చేశారు  అప్పట్లో వామపక్ష పార్టీలు మిత్రపక్షంగా ఉండడంతో వారిని కలుపుకొని పనిచేసి ఎంపీపీగా ఎన్నికయ్యారు  మొదటి మండల పరిషత్ అధ్యక్షుడుగా ఉన్న ఐదేళ్ల కాలంలో మెట్ట ప్రాంత గ్రామాలలో ప్రజల అవసరాల మేరకు  సమస్యలు పరిష్కరించాడు  మండలంలోని 13 గ్రామాల్లో రక్షిత పథకాలు ఏర్పాటు చేశాడు. అవసరమైన చోట్ల పంచాయతీ కార్యాలయ భవనాలు కూడా నిర్మించాడు  ముఖ్యంగా ప్రజల రైతుల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి డొంక రోడ్లు నిర్మించాలనుకున్నాడు స్త్రీ మహిళా మండలి భవన నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశాడు  1990లో వచ్చిన తుఫాను వల్ల పలు గ్రామాలకు వెళ్లే మెయిన్ రోడ్లు పూర్తిగా పాడవడంతో  వరల్డ్ బ్యాంకు నుంచి నిధులు రాబట్టి  గన్నవరం సూరంపల్లి కేసరపల్లి ముస్తాబాద్ రోడ్లను  తారు రోడ్లుగా నిర్మించాడు  1995లో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత  నేటి వసతులు రోడ్లు వేయించడం చేశారు  అన్ని గ్రామాల్లోనూ భవన సముదాయాలు నిర్మించడం  మీరు నీరు పథకంలో చెరువుల నీటికి  తగిన నిధులు కేటాయించడం చేశాడు  చివరి క్షణం వరకు  అజాతశత్రువు గానే పేరు సంపాదించుకున్నారు. అందరి మన్ననలను పొందాడు  అలాంటి చక్కటి స్నేహితుడిని భౌతికంగా కోల్పోవడం  మా అందరికీ బాధాకరం.

కామెంట్‌లు