మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 నేను ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో పనిచేస్తున్న సమయంలోనే  కొల్లూరి గారు పరిచయం కావడం  ఆ తరువాత ఎక్స్ రే అన్న సంస్థను స్థాపించి  ప్రతి నెల  కొత్త యువ కవులను ప్రోత్సహించడం కోసం  కార్యక్రమాలు చేస్తూ ఉన్న సమయంలో  ఒకరోజు అనుకోకుండా  కవిత చదవకుండా  తన గురించి పరిచయం చేసుకున్న  ఓ స్త్రీ మూర్తి రావడం  చాలా ఆనందం అనిపించింది  ఆమె పేరు చెరుకూరి షీల జీవితంలో అన్నీ ఉండి  సమాజానికి ఏదో చేయాలన్న కుతూహలంతో  గన్నవరంలో  అమ్మ  అన్న సంస్థను ఏర్పాటు చేసి  నా అనేవారు లేని వృద్ధులను  చేరదీసి వారందరికీ తానే అమ్మగా  కుమార్తెగా  సేవలు చేయాలి అన్న అభిప్రాయంతో  మమ్మల్ని ఒక రోజు అక్కడికి వచ్చి  మా పిల్లలని చూడమని ఆహ్వానించడంతో అక్కడికి వెళ్లాం. మనిషి జీవనక్రమంలో ఎన్నో రకాలుగా మనిషికి మనిషికి బంధం ఏర్పడుతుంది  అన్ని బంధాల కన్నా సమాజంలో ఉన్న వ్యక్తులతో కలిగిన సామాజిక మంత్రం చాలా గొప్పది  అలాంటి సేవా తత్పరతను  మనుషుల్లో పెంపొందించడం అమ్మ సేవాసదనం యొక్క ధ్యేయం.  మనుషుల మధ్య సంబంధాలు దూరం పెరుగుతున్న ఈ రోజుల్లో కుటుంబ పరంగా ఏ సంబంధము లేని వ్యక్తులను  ఆదుకోవడం  షీలా గారి  జీవిత ఆశయం  అమ్మ సేవాసదనం వృద్ధులకు అన్ని రకాలుగా చేయుతనిస్తూ వారి సేవలో పునీతమవుతోంది  ఆమె సంస్థ అభివృద్ధికి ఎంతోమంది పెద్దలు దాతలు మిత్రులు చేయూత నిచ్చి ప్రోత్సహిస్తున్నారు కూడా  ఎవరూ లేని అనాధ వృద్ధులకు అన్నీ కల్పిస్తూ ఆదరాభిమానాలు ప్రేమ ఆప్యాయతలను పంచుతూ  వారికి బంధువులు లేని లోటును  తీరుస్తున్న  అమ్మ షీల. మా అందరినీ చూసిన తర్వాత అక్కడ  ముదుసలులకు ఎంత ఆనందం కలిగిందో చెప్పడానికి వీలు లేదు  మమ్మల్ని తమ సొంత బిడ్డల్లా  పలకరిస్తూ మా యోగక్షేమాలను  తెలుసుకున్నారు  తర్వాత మేము  వారి జీవిత విశేషాలను  తెలుసుకున్నాం  ఒక్కొక్కడివి ఒక్కొక్క దీనగాథ  ఆ సాయంత్రం టీ తాగి  అమ్మల సమక్షంలో కవితా గానం చేసాం  ఎక్కువ భాగం షీలా గారి గురించి పొగడ్తలు  వారి లాంటి వారు ఒక్కరు ఉంటే చాలు  దేశం గర్వపడుతుంది అంటూ  అలాగే అక్కడ వారి దీనగాథలను  గేయ రూపంలో వినిపించినప్పుడు  వారి ఆనంద భాష్పాలు చూస్తే  మాకు ఎంత  ఆహ్లాదంగా ఉందో చెప్పలేం  మీకు మేము చేదోడు వాదోడుగా ఉంటాం  అంటూ జరిగిన  కవితా గోష్టి  పూర్తిచేసి వారి ఆశీస్సులతో బయటకు వచ్చాము  షీలా గారికి అభినందనలను తెలియజేస్తూ.

కామెంట్‌లు