మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

జీవితంలో  మార్పు దాని  అంతట అది రాదు  ఏదో సంఘటన జరగాలి  అనుభవంతో తప్ప  మరొక మార్గం లేదు  1938 వ సంవత్సరంలో పడిపోరా ఏఐసీసీ మహాసభకు వెళ్ళినప్పుడు అక్కడ పుచ్చలపల్లి సుందరయ్య గారు కలిశారు  వారి వ్యక్తిత్వం మాటతీరు ప్రవర్తన ఆచరణ పుల్లారెడ్డి గారిని ఎంతగానో ఆకర్షించాయి ఈ నేపథ్యంలోనే బొమ్మా రెడ్డి వింత అప్పిరెడ్డి  బోధనలతో పుల్లారెడ్డి గారు కమ్యూనిస్టుగా మారారు  వామపక్ష భావాలు వారి మనసుకు బాగా నచ్చినయి  ఆ సందర్భంగా తనకున్న 10 ఎకరాల భూమిని  జాతీయ ఉద్యమానికి సమానత్వ సాధనకు  పరిశ్రమిస్తున్న  కమ్యూనిస్టు ఉద్యమానికి చెందాలి అని  వ్రాతపూర్వకంగా  పార్టీకి ఇచ్చారు.1942లో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన స్వతంత్ర భారత్ పత్రిక  తన దగ్గర ఉన్నదన్న అభియోగంతో ఆయనను అరెస్ట్ చేసి ఆరు నెలల పాటు బళ్లారి జైలులో ఉంచారు  జైలు నుంచి విడుదలైన  తర్వాత గన్నవరం ప్రాంతంలో సుందరయ్య గారితో కలిసి కమ్యూనిస్టుల ఉద్యమంలో పని చేశారు  సుమారు 21 సంవత్సరాల పాటు తేలప్రోలు  పంచాయతీ సర్పంచిగా పనిచేశారు  గ్రామం కోసం తాను చేయని పని లేదు  తన సొంత ధనాన్ని కూడా ఖర్చు చేసి  గ్రామ అభివృద్ధి తన అభివృద్ధిగా భావించారు  ఆ రోజుల్లో పంచాయతీలకు ఇప్పట్లాగా ప్రభుత్వ నిధులు పెద్దగా వచ్చేవి కావు  వారి కాలంలో  మొత్తం  కోటి 16 లక్షల రూపాయల  ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తేలప్రోలు సెంటర్ నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో ఉన్న ఏలూరు కాలువ  పైన వంతెన నిర్మాణం చేయడం గ్రామంలోని అనేక పేటల్లో కమ్యూనిటీ హాళ్లు స్కూలు భవనాలు కాలనీలు  నిర్మాణం చేపట్టారు విద్యుత్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయించారు  సర్పంచి గానే కాక ఆయన గన్నవరం వీరవల్లి సమితిలో సభ్యుడుగా కూడా పనిచేశారు  వారు ఈ పని చేశారు ఆ పని చేశారు అని చెప్పడానికి  వీలు లేకుండా అన్ని పనులను చివరకు  స్త్రీలను కూడా పంచాయితీ  సభ్యులనుగా చేసి  వారికి పాలనా పాట వాన్ని కూడా నేర్పారు  అంత సహనశీలి  అంత పరోపకారి  ఇతరుల క్షేమము సంక్షేమమే తనదిగా భావించే వ్యక్తి  మా గ్రామ వాసి కావడం మా అందరికీ ఎంతో గర్వకారణం. వారు భౌతికంగా మాకు దూరమైనా వారి ఆశలు ఆశయాలు మమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి.

కామెంట్‌లు