సహజ గుణం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కవిత్వం చెప్పాలనుకునే మనసు కలిగిన వాడికి ప్రతిదీ కవితా వస్తువే  దేనిని తక్కువగా చూడవలసిన అవసరం లేదు ఉంటాడు శ్రీశ్రీ  ఆ సిద్ధాంతానికి చాలా దగ్గరగా  వేదాంత విషయాన్ని చెప్పడానికి కూడా  భక్తి ప్రపత్తులను నెలకొల్పడానికి  ఒక కుక్కని మరొక కొంగని మరొక గాడిదని చివరకు కప్పని  ఉదాహరణగా తీసుకొని  వాటి జీవిత తత్వాలను అధ్యయనం చేసి  అవి చేసే పనుల వల్ల  వాటికైనా ప్రయోజనం ఉంటుందా  జీవితంలో భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా  అంటూ  ప్రశ్నిస్తున్నాడు వేమన. మన పెద్దవాళ్ళు చెప్పడం బావిలో కప్పగా బ్రతకకురా  కొంచెం జ్ఞానం తెలుసుకొని బ్రతుకు  ఆ బావి తప్ప ఆ కప్పకు ఏమీ తెలియని స్థితి  లా  నీవు మన ఇంటి  గురించి తప్ప మిగిలిన విషయాలన్నీ తెలుసుకో అని సలహా ఇస్తూ ఉంటారు పెద్దలు. మీరు కుక్కను గమనించండి  అది ఏకాంతాన్ని కోరుకుంటుంది. ఆ ఇంటిని కాపలా కాయడం తప్ప  తన యజమానికి రక్షణ  చేకూర్చాలి అని ఆలోచిస్తుంది తప్ప  మరొక విషయం గురించి దానికి తెలియదు  నిజానికి ఆలోచించవలసిన అవసరం లేదు కూడా. దానికి కూడా ఏమో  కుక్క విశ్వాసాన్ని గాని దాని పనితనాన్ని గాని ఎవరు శంకించరు. అలాగే కొంగని తీసుకున్నట్లయితే  ఆహార సమపార్జన కోసం అది ఎప్పుడు  చిన్న నీటి గుంటలను వెతుకుతూ ఉంటుంది  ఆ గుంటలో దిగి  ఒంటికాలి పై తపస్సు చేస్తూ మౌనంగా ఉంటుంది  దానితో ఎలాంటి శబ్దము  రాదు కనుక ఆ చేపలు బయటకు వస్తాయి  దానిని గుటుక్కున తిని తన ఆకలిని తీర్చుకుంటాయి కొంగలు  తిండి కోసం చేసే  మోసం తప్ప అది ధ్యానం కాదు. గాడిదను గమనించినట్లయితే  దానికి ఏకాంతం దొరికిన సమయంలో  సంగీతాన్ని ఆలపిస్తుంది  ఆ గాడిద స్వరంతో ఎంతో ఆనందాన్ని పొందుతుంది  మనవాళ్లు సంగీతం రాకుండా ఏదో పాడుతున్న వారిని  ఒరేయ్ నీ గార్ధప స్వరం వినలేక చస్తున్నాం  కాసేపు దానిని ఆపరా  అంటాం కదా  దానిది అంతే  కప్పలు గనక చూసినట్లయితే  దాని జీవితం అంతా నీళ్లలోనే గడుపుతుంది  మనం పూజా పునస్కారం చేయాలనుకుంటే  స్నానం చేసిన తర్వాత కానీ ఆ పనికి వెళ్ళము  అది ఎప్పుడు స్నానం చేస్తూనే ఉంటుంది కదా  ప్రతిక్షణం శుభ్రంగానే ఉంటుంది  మరి ఈ నాలుగు  ఉదాహరణలు చెప్పి వేమన  అది వాటి ఆత్మలో తత్వాన్ని గురించి గనక ఆలోచించినట్లయితే  అంతకుమించిన బ్రహ్మానందం మరేమీ ఉంటుంది అంటూ పద్యాన్ని పూరించాడు వేమన  దానిని ఒక్కసారి చదవండి.

"కుక్క యేకతంబు కొక్కెర ధ్యానంబు గాడ్డె రాగమెన్న గప్ప ముసుగు ఆత్మ నెరుగు భావ మది యేల జేయరో..."


కామెంట్‌లు