వీరమాచినేని సరోజిని గారు ఆ పేరు వినగానే బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నమాట గుర్తుకొస్తుంది తన జీవితంలో వారి బాబాయ్ వామపక్షపాతి కావడంతో ఆ భావాలు చిన్నతనం నుంచి తన మనసులో స్థిరంగా ఉండిపోయిన సినీ ప్రపంచంలో వి మధుసూదన్ రావు గారి పేరు వినని వారు అరుదు వారు తీసిన ప్రతి చిత్రం వంద రోజులు ఆడింది వారిని వివాహం చేసుకున్నారు సరోజిని గారు ఇద్దరి భావాలు ఒకటిగా ఉండడంతో అనేక చర్చా కార్యక్రమాలలో ఇద్దరూ ఏకొన్ముఖులై చక్కటి చిత్రాలను ఆంధ్రులకు అందించారు కొన్ని చిత్రాలకు సరోజిని గారు కథలు కూడా రాశారు భర్తకు చేదోడు వాదోడుగా ఉండడంతో ఒక కొత్త ఆలోచన వచ్చి మహానటి సావిత్రితో సంప్రదించి అందరూ ఆడవారితో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు.
నిర్మాత దర్శకురాలు నటీ నటులులు సాంకేతిక నిపుణులు అందరూ కూడా మహిళలే చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకుని వారి కోసం తీసిన సినిమా చిన్నారి పాపలు ఎంతో విజయవంతమైన సినిమా దానితో స్త్రీలు ఏ విషయంలోనూ తీసిపోరు నిజానికి పురుషులకు ఆలోచనలను రేకెత్తించేది కూడా స్త్రీలే అన్న విషయాన్ని రుజువు చేశారు సరోజిని గారు ప్రపంచ చరిత్రలో అందరూ స్త్రీలతో నిర్మించిన సినిమాగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన ఏకైక స్త్రీ దానితో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న నంది అవార్డును కూడా సాధించడం ఆమె ప్రజ్ఞకు తార్కాణం ఆమె మరెవరో కాదు మా గ్రామానికి అతి దగ్గరలో ఉన్న ఆత్కూరు గ్రామంలో ఉన్న అట్లూరి శ్రీమన్నారాయణ గారి అన్న కుమార్తె. కమ్యూనిస్టుల కార్యక్రమం ఎక్కడ ఉన్నా ఆవేదికపై ఆమె బుర్రకథ చెప్పడం ప్రారంభించింది నాజర్ గారు మగవారిలో ఎంత పేరు తెచ్చుకున్నారు స్త్రీలలో ఆమె కూడా అంత పేరు సంపాదించుకోండి ప్రజానాట్యమండలి వారి ఆధ్వర్యంలో ఆమె అనేక నాటకాలు ప్రదర్శించారు ఎన్నో నాటకాలు కూడా రాశారు ఆమె రాసిన నాటకం పేరు ఎర్ర గాజుల వీరమ్మ 82 జనవరిలో సిపిఎం అఖిల భారత మహాసభలకు కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన పది లక్షల మంది పాల్గొన సభలో ప్రదర్శించారు ఆ నాటకాన్ని ఆ నాటకంలో ఆమె వీరమ్మ పాత్ర నిర్వహించడం విశేషం మధుసూదన్ రావు గారి అరంగేట్రం సినిమాలో నాకు ఉమా ప్రస్తుతం అన్నపూర్ణ లకు స్థానం కల్పించింది సరోజిని గారు ఆమె లేని లోపం మరి ఎవరు భర్తీ చేయలేని లోపమే.
మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి