స్థిర చిత్తం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ ప్రపంచానికి వెలుగునిచ్చి తన కాంతి ద్వారా  జీవాన్ని కలుగ చేసే సూర్య భగవానుడు  అనుక్షణం తన కర్తవ్య నిర్వహణలో నిమగ్నమై  క్షణం కూడా ఆదమరపు లేకుండా  పనిచేయడం మనందరికీ తెలుసు  ఆ సూర్య భగవానుని ప్రయాణంలో  ఆకాశంలో ఏదైనా ఒక మబ్బు తెర అడ్డు వచ్చినట్లయితే  ఈ భూమి మీదకు రావలసిన  వెలుగు  మనకు కనిపించదు  ఆ సూర్యుని నుంచి వచ్చిన  కిరణాన్ని ఈ మబ్బు అడ్డుకోవడం వలన  మనకు కనిపించదు తప్ప  దాని ప్రసరణలో ఎలాంటి లోపము ఉండదు  అనునిత్యం  అనుక్షణం సూర్య భగవానుడు తన కాంతిని అలా  ప్రపంచానికి అందిస్తూనే ఉంటాడు  వారి కార్యక్రమంలో ఎలాంటి అవరోధము రాదు  ఒకవేళ వస్తే  అది ప్రళయమే.
మానవుడు దీక్షతో ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టి నిర్విజ్ఞంగా చేయాలని  ప్రయత్నం చేస్తున్న సమయంలో  ఆ మబ్బు అడ్డు రావడంతో  చీకటి వ్యాపించి  తన ఏకాగ్రత చెడిపోతుంది  ఎప్పుడైతే ఏకాగ్రత చెడిపోయిందో  ఆ క్షణంలో మతిమరుపు రావడానికి అవకాశం ఏర్పడుతుంది  మతిమరుపు ఎప్పుడు వచ్చిందో అప్పుడు  తాను చేస్తున్న కార్యక్రమాన్ని  మర్చిపోయి దేనిని గురించి ఆలోచించడం మొదట పెడతాడు  అలా ఎప్పుడైతే మనసు వైవిధ్యమైన ఆలోచనలకు వెళ్లిందో  అలాంటి వారికి మోక్ష ప్రాప్తి కలుగదు  ఇది ఋషి పుంగవులు మనకు చెప్పిన విషయం  కనుక తన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా  మనపైనే ఉన్నది అన్న విషయాన్ని మర్చిపోకూడదు.
అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు  దానిని సరి చేసే వ్యక్తి ఒకే ఒక్కరు  వారే గురు స్థానంలో ఉన్న వ్యక్తి  ఏ అవరోధాన్ని ఎలా  దాటించాలో వారికి బాగా తెలుసు  కనుక అలాంటి వారి  పాతపట్నం  నమస్కారం చేసి తనకు జరిగిన  అవరోధాని గురించి వారికి తెలియజేసినట్లయితే  దానికి మార్గం ఏమిటో ఆయన ఖచ్చితంగా చెప్పగలరు  దానిని  సక్రమంగా  ఎలాంటి లోటు రానివ్వకుండా చేసినట్లయితే  అతని సాధన  సాఫల్యాన్ని పొందుతుంది  లేకపోయినట్లయితే మళ్లీ విషయం మొదటికే వస్తుంది  ఆ తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళడానికి కూడా మొహం చెల్లదు  కనుక నిజంగా మోక్ష మార్గాన్ని అన్వేషించే వ్యక్తి దానిపై తప్ప మరొక ఆలోచన లేకుండా చేసినట్లయితే  తప్పకుండా విజయాన్ని సాధించి ముక్తిని పొందవచ్చు అంటాడు వేమన  వారు రాసిన పద్యాన్ని చదవండి.

"మేఘ మడ్డమైన మిహిరుని  జెరుచును  చిత్త మడ్డమైన స్థిరము జెరుచు మరపు లడ్డమైన మరి ముక్తి జెరుచును..."


కామెంట్‌లు