ప్రధమ జ్ఞాన పీఠ బహుమతి గ్రహీత- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 విశ్వనాథ వారి రచనలు  ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాయి. వేయి పడగలు నవల  భారతీయత  అంటే  ఏమిటో భారతీయులకు తెలియజేసిన గ్రంథం  సనాతన ధర్మం ఎలా ఉండాలి  విద్యార్థి దశ  లో ఉన్న  ఆనాటి పద్ధతులను  గురు శిష్య సంబంధాలను  తెలియజేస్తూ  ప్రతి  వ్యక్తి చదివి తీరవలసిన పుస్తకంగా  వారు రాశారు. వీరంటే మొదటి నుంచి ఎంతో గౌరవం ప్రేమ ఉన్న పీవీ నరసింహారావు గారు  అనేక భాషలు నేర్చుకున్న వారు.  వేయి పడగలు నవలను  సహస్ర ఫణి అన్న పేరుతో హిందీలో రాసి  డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారి అధ్యక్షతన  జరిగే జ్ఞానపీఠ బహుమతుల  ఎంపికకు  పంపగా  భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో వ్రాసిన  రచనల అన్నిటిలోనూ ఉత్తమమైనదిగా ఎన్నిక చేసి దీనికి  జ్ఞానపీఠ బహుమతి  రావడం  అలా ఆంధ్రదేశానికి మొదటి బహుమతిని తీసుకొచ్చిన వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారే. ఆ తర్వాత డాక్టర్ సి.నారాయణరెడ్డి గారికి, మూడవ బహుమతి  రావూరు భరద్వాజ పాకుడు రాళ్లకు  వచ్చింది  అలా మూడు  జ్ఞానపీఠలను  సంపాదించిన రాష్ట్రంగా ఆంధ్ర  నిలిచింది  తర్వాత ఆంధ్రదేశానికి  ఆస్థాన కవిగా  ప్రభుత్వం విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆహ్వానించినప్పుడు  మొదటి ఆస్థాన కవులుగా ఉన్న తమ గురువులు తిరుపతి వేంకట కవులను తలచుకొని  వారు అధిష్టించిన  సింహాసనానికి నమస్కరించి  దానిపై ఆసీనులై  సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వ్యక్తి  ఆంధ్ర దేశంలోనే కాక ఇతర ప్రాంతాలలో కూడా వారికి రాని బహుమతి అంటూ ఏదీ లేదు. అన్ని ప్రక్రియలను  సాహిత్య  లోకానికి అందించిన వ్యక్తి  కవి సమ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ గారు అనడంలో ఏ మాత్రం  అతిశయోక్తి లేదు ఈ సందర్భంగా వేయి పడగల  నవల గురించి చిన్న సంఘటన  చెప్పాలి  ఒక పర్యాయం కళాశాలలో విశ్వనాథ సత్యనారాయణ గారు  వేయి పడగల  నవలను  పిల్లలకు చెబుతున్న సందర్భంలో  ఒక విద్యార్థిని ఆలస్యంగా పుస్తకం లేకుండా రావడంతో  ఇవాళ రెండు కిలోల బరువు మోయలేని నీవు 60 కిలోల బరువు ఎలా మోస్తావు  అనేసరికి  ఆమె సోదరుడు  అదేమిటి మాస్టారు అని  అనగానే కూర్చోరా లంజా కొడకా అనడం. తర్వాత  ప్రిన్సిపాల్ నక్కా రామారావు గారు  వచ్చి ఏమిటని అడిగితే  వాడిని తిట్టలేదు పొగిడాను లం అంటే నీరు జ అంటే పుట్టడం  నీటి నుంచి భూమి నుంచి పుట్టిన  లక్ష్మీ సరస్వతులకు  పుత్రుడువు రా  అన్నాను అనేసరికి  ఎవరికి మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది భాష పై పట్టు ఉన్నవారు  ఏ అక్షరాన్ని ఎలా మలవాలో  అలా చెప్పగలిగిన మేధావులు  అలాంటిఅలాంటి వ్యక్తులలో ప్రథములు విశ్వనాథ వారు.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం