ఆకారం కాదు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సమాజం అంటేనే  అనేక మనస్తత్వముల కలయిక  మన చుట్టూ ఉన్న వారిని ఎవరిని మనం విరోధం చేసుకోము  ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా ఉండడం స్నేహం గా ఉండడం అలవాటు చేసుకుంటాం. అలాంటి వ్యక్తుల తత్వాలు ఎలా ఉంటాయో కూడా వ్యక్తిగతంగా మనకు తెలియదు  మన పూర్వా పరాలు మనం చెప్పినవి తప్ప వారికి ఏమీ అర్థం కాదు  ఇలాంటి సందర్భంలో తత్వాలు  ఎలా ఉంటాయి ఎదుటివారు వీరిని గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటారు  ఇచ్చిపుచ్చుకునే మర్యాదలు ఏ రూపంలో ఉంటాయి అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే  ఏ వ్యక్తి అయినా  రూపంలో  ఆహార్యంలో  ప్రవర్తనలో  గడ్డాలు మీసాలు  పెంచుకుని చూడడానికి  ఆకర్షణీయంగా ఉంటే  అతను చాలా మంచివాడు గొప్పవాడు అని అభిప్రాయం లోకి వస్తాము.
చక్కటి మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తూ ఉన్న వ్యక్తి  అందరి మనసులను దోచి ఎలా  ఉన్న ప్రవర్తన వల్ల మాత్రమే అతని గొప్పతనం బయటకు రాదు  అతని జీవితంలో ఎవరికైనా  అత్యవసర పరిస్థితిలోనైనా సాయం చేసిన  సంఘటనలు ఏమైనా ఉన్నాయా?  నిజమైన ఆకలితో బాధపడుతూ ఉన్న వ్యక్తికి  ఒక్క పూట అయినా భోజనం పెట్టించాడా? లాంటి విషయాలను గమనించినట్లయితే  పిల్లికి కూడా భిక్షం పెట్టని వ్యక్తి  అని మనకు తెలుస్తోంది. అలాంటి వాడికి సమాజం గౌరవం ఇవ్వాలా  ఇవ్వనవసరం లేదా  అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవలసిన విషయం అని చెప్తున్నాడు వేమన  గౌరవాన్ని మర్యాదను కొనలేం కదా  ధనం వల్ల లభించేది కాదు అది  మనం చేసే పనుల వల్ల మాత్రమే మనకు గౌరవ మర్యాదలు దక్కుతాయి అన్న విషయం  వేమన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
రైతు వారి కుటుంబాలలో  జంతువులను పెంచడం  వాటి ద్వారా  ఉత్తమ కార్యాలను  నిర్వహించుకోవడం తెలుస్తుంది  సామాన్యంగా రైతు జతను అటు వ్యవసాయానికి పనికొస్తాయి  ఆవులు  పాల కోసం  అలాగే గేదలు దున్నలు కూడా ఉంటాయి  దున్నలు వ్యవసాయానికి పనికొస్తాయి  వేమన ఆ దున్నను  ఉదాహరణగా తీసుకుని  అది ఎక్కువ బలిసినంత మాత్రం చేత ఏనుగు అవ్వడానికి అవకాశం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు  స్వతహాగా ఏ జంతువుకు ఉండే పద్ధతులు ఆ జంతువుకు ఉంటాయి  కొత్త పద్ధతిలో ఊహించుకోవడం  అజ్ఞానమే అవుతుంది  అని చెప్తున్నాడు వేమ  వేమన  ఎంతో అనుభవంతో రాసిన ఈ పద్యాన్ని ఒక్కసారి చదవండి  మన అజ్ఞానం ఏమిటో కూడా తెలుస్తుంది.

"ఒడ్డు పొడుగు గలిగి గడ్డంబు పొడుగైన  దాన గుణము లేక దాతయగునె  యెనుము గొప్పదైన యేనుగు బోలునా..."



కామెంట్‌లు