దైవ బలం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఈ భూమి మీద మనిషికి  జీవితకాలం  స్వల్పం  చేయాలనుకున్న పనులు  అనల్పం  ఇది చేయాలి ఇలాగే చేయాలి అన్న ఆలోచన ఆ మనసుకు రాదు  ఎందుకు ఇలా చేస్తున్నారు కూడా ఆలోచించే అవకాశం ఉండదు  ప్రతి దానికి  ఒక సంఘటన ఉంటుంది ఓ సందర్భం  ఆరింటిని సద్వినియోగం చేసుకున్న వ్యక్తి  సరియైన మార్గంలో జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది  ఏదైనా ఘటన జరిగి  దానివల్ల  భయబ్రాంతులకు లోనై జీవితంపై  విరక్తి కలిగి ఇక మనం చేయవలసింది ఏదీ లేదు అని  నిర్ణయించుకుంటే ఆ జీవితకాలం అంతటితో సరి  దానికి కొనసాగింపు ఉండదు  నిలిచి గెలిచిన శక్తి నెగడుగాక దవ్వు దవ్వునిట్లయిన నవ్వరెట్లు అనిమనకు తిక్కన మహా శివుడు చెప్పిన విషయం. ఉత్తర గోగ్రహణం సందర్భంగా  నపుంసకుని వేసేసాడిగా ఉన్న అర్జునుడు చెప్పిన మాట  మాటలతోకోటలను దాటించే  అసమర్థులైన  వ్యక్తులకు చెప్పిన మాట  జీవితంలో ప్రతి ఒక్కరు  అనుసరించవలసిన నీతి కూడా  అందుకే భారతం ఇంత కాలమైనా నిలిచింది ప్రజల హృదయాలలో  మనకు ఆర్థిక బలం అంగ బలం  మనోబలం 3  మూడు రకాలుగా ఉపయోగపడతాయి  ఆర్థిక బలం  సామాజిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసే కార్యక్రమాలకు  ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పనవసరం లేదు  అంగ బలం  మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని  రెట్టింపు చేస్తుంది  తన వెనక తనను కాచి రక్షించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారో నన్న నమ్మకం  చివరిది మనో బలం లేకపోయినట్లు అయితే మిగిలిన ఎన్ని బలాలు ఉన్నా అతను బలహీనుడే  ఆ స్థితి ఎవరికీ ఉండకూడదు అంటాడు వేమన. మానవునికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా  ఉన్నది అన్న విషయం అప్పుడు జ్ఞాపకం వస్తుంది  వ్యక్తిగా తాను ఈ సమాజంలో అన్ని బలాలను వదులుకున్నా  దైవ బలాన్ని నమ్మిన వ్యక్తులు  తాము చేయదలుచుకున్న ఏ కార్యక్రమానికైనా  సహాయకారిగా ఉంటుంది అన్నది  నిత్య సత్యం  ఆ సత్యాన్ని పట్టుకొని ఒక్కసారి శివ అన్న శబ్దంతో  తన మనోబలాన్ని  విస్తృతం చేసుకోవచ్చు  ఎప్పుడు ఆత్మ శుద్ధితో  ఆ శబ్దం పై మనసును కేంద్రీకరించి చేస్తున్నావు  అది ఫలించి నీకు  ముక్తిని ప్రసాదించడమే కాదు మరణించిన తరువాత  జీవితకాలం నీకు  సహాయకారిగా ఆనామ బలం ఉంటుంది అన్నది నిర్వివాదాంశం  దానిని నమ్మి మీ పనులు మీరు సుఖవంతం చేసుకోండని వేమన మనకు చెబుతున్న నీతి ఆ పద్యాన్ని చదవండి.

"అన్ని జాడలుడికి యానంద కాముడై  నిన్ను నమ్మజాలు నిష్ట తోడ  నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీ యాన..."


కామెంట్‌లు