ప్రధమ జ్ఞాన పీఠ బహుమతి గ్రహీత;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం9492811322.
 విశ్వనాథ సత్యనారాయణ గారిని గురించి తెలుసుకోవాలని అనుకుంటే అది మరొక  కల్ప వృక్షం అవుతుంది  నేను ఆకాశవాణికి వచ్చిన కొత్తలో అనేక కార్యక్రమాలకు విశ్వనాథ సత్యనారాయణ గారు వస్తూ ఉండేవారు  నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు వారి గురించి విన్నాను  ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను వారి మాటలు చేతలు విచిత్రంగా ఉంటాయి చిత్రంగా అనేది  ఆయనకు ఊతపదం చక్రం చేశారు  అనడం  ఆయనకు అలవాటు  ఉషశ్రీ గారు విజయవాడ కేంద్రానికి వచ్చిన తర్వాత వారితో సన్నిహిత సంబంధం ఏర్పడింది  మేమిద్దరం సత్యనారాయణ గారి ఇంటికి వెళుతూ ఉండేవాడు  సాహిత్య విషయాలు వారి నోటి నుంచి వినడం ఒక అదృష్టం  ఒకే విషయాన్ని భిన్న కోణాల్లో చెప్పగలిగిన ఏకైక వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారు. బాగా చొరవ పెరిగిన తర్వాత గురువుగారు మీరు రామాయణ కల్ప వృక్షం అద్భుతంగా వ్రాశారు  దాని శైలి గురించి మాట్లాడే అనుభవం నాకు లేదు  నాకున్న అనుమానాన్ని నివృత్తి చేస్తానంటే ఒక ప్రశ్న అడుగుతాను అన్నాను నీకు అడ్డేం ఉందిరా అడుగు అన్నారు వాల్మీకి మహర్షి రాసిన అద్భుతమైన కావ్యం రామాయణం కదా అలాంటి వాల్మీకి మహర్షిని మించి వేరే విషయాలు రాయాలన్న అభిప్రాయంతో ఈ గ్రంథాన్ని మీరు ఆంధ్రులకు అందించారా అంటే చిరునవ్వు  నవ్వి ఒరేయ్ ఆ మహర్షిలో మనం ఎన్నో వంతురా వారితో పోలికా వారిని మించి వ్రాయడమా ఎవరూ కలలో కూడా ఊహించని విషయం  ఎంత ఆదికవి కాకపోతే ఈ క్షణానికీ ప్రపంచం మొత్తం వారిని ఎందుకు స్మరిస్తూ ఉంటుంది  అన్నారు.
మీరు అందరికీ చెప్పిన సమాధానం  ఉదయం భోజనం చేస్తున్నాను కదా మళ్ళీ తిరిగి రాత్రి ఎందుకు భోజనం చేస్తూ ఉంటాం తిన్నదానినే తింటున్నాము  కదా  అన్నారు ఆ సమాధానం కాకుండా మీ మనసులో దాగి ఉన్న అభిప్రాయాన్ని తెలియజేయండి  అంటే వారు చెప్పిన  వాల్మీకి మహర్షి వ్రాసిన ఏ ఒక్క శ్లోకంలోనూ ఒక అక్షరాన్ని మార్చినా దాని  అతుకు అతుకు గానే కనిపిస్తుంది ఎవరూ మార్చలేరు వాల్మీకి మహర్షి వాచ్యముగా చెప్పిన విషయాన్ని  నేను దృశ్యం చేసి నాకు బాగా ఇష్టమైన తిక్కన గారి దృష్టితో  నాటకీయతతో రాశాను అని సమాధానం  ఆ తర్వాత ఉషశ్రీ గారు  వారి మనసులో మాట బాగా చెప్పించావు  నీవు ఆకాశవాణికి చాలా బాగా సరిపోతావు అని  అభినందించాడు.

కామెంట్‌లు