గణేషుని అవతారం.- సేకరణ : డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.9884429899

 ముద్గలపురాణంలో వినాయకుని ఎనిమిది అవతారాలు చెప్పబడినాయి. (వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు). ఆ ఎనిమిది అవతారాలలో ఐదు అవతారాలకు వాహనం ఎలుక. వక్రతుండ అవతారం వాహనం సింహం. వికట అవతారం వాహనం నెమలి. విఘ్నరాజ అవతారం వాహనం శేషువు. గణేశ పురాణంలో నాలుగు అవతారాలు ప్రస్తావింపబడినాయి. అందులో మహోటక అవతారం వాహనం సింహం. మయూరేశ్వర అవతారం నెమలి. ధూమ్రకేతు అవతారం గుర్రం. గజాననుని అవతారం ఎలుక. జైనుల సంప్రదాయాలలో గణేశునికి ఎలుక, ఏనుగు, తాబేలు, పొట్టేలు, నెమలి వాహనాలు వివిధ సందర్భాలలో చెప్పబడినాయి.  
7వ శతాబ్దం నుండి మధ్య, పశ్చిమ భారతంలో వచ్చిన శిల్పాలలో ఎలుకను చూపడం మొదలయ్యిందని Martin-Dubost అభిప్రాయపడ్డాడు. లిఖిత గ్రంథాలలో మత్స్య పురాణములో మొట్టమొదటగా ఎలుక వాహనం గురించి వ్రాయబడింది. తరువాత బ్రహ్మాండ పురాణము, గణేశ పురాణములలో ఈ విషయం ఉంది. చివరి అవతారంలో ఎలుకను వాహనంగా చేసుకొన్నట్లు గణేశపురాణంలో ఉంది. గణపతి అధర్వశీర్షం అనే గ్రంథంలో ఒక ధ్యాన శ్లోకం ప్రకారం వినాయకుని ధ్వజంమీద ఎలుక ఉంటుంది. గణపతి సహస్రనామాలలో "మూషిక వాహన", "అఖుకేతన" అనే పేర్లున్నాయి.
ఎలుక వాహనం సంకేతాన్ని అనేక విధాలుగా వివరిస్తారు - ఎలుక తామస ప్రవృత్తికి చిహ్నం. కనుక కామక్రోధాలను అణగ ద్రొక్కడం అనగా ఎలుకపై స్వారీ చేయడం.. పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను నివారించడం అని మరొక వివరణ ఉంది. ఇది గ్రామదేవత లక్షణాలలో ఒకటి ఎలుకనెక్కినందున వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడని (సర్వాంతర్యామి) మరొక అభిప్రాయం ఉంది.
పార్వతి విష్ణువును పూజించి, పుణ్యకవ్రతము మాచరించి కొడుకును కన్నది. ఆ బాలుని జన్మ వేడుకలలో బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆశీర్వదించారు. కాని శనీశ్వరుడు మాత్రం ఆ బాలుని వైపు చూడలేదు, తన దృష్టి వల్ల హాని జరుగుతుందనే భయంతో. కాని పార్వతి బలవంతంపై బాలుని ముఖం చూడక తప్పలేదు. అప్పుడు ఆ బిడ్డ తల పగిలిపోయింది. దేవతలంతా చింతితులు కాగా విష్ణువు పుష్పభద్రానదీ తీరంనుంచి ఒక గున్న ఏనుగు తల తెచ్చి, అతికించి, ఆ బాలును పునరుజ్జీవితుని చేశాడు.
మరొక కథ ప్రకారం (వరాహ పురాణం) - శివుని నవ్వు నుండి వినాయకుడు జన్మించాడు. అయితే వినాయకుని అందం చాలా ఎక్కువ కావడం వలన (దిష్టి తగులకుండా?) శివుడు అతనికి ఏనుగు తల, బాన పొట్ట ఉండేలా చేశాడు.
గణాధిపత్యం, చంద్రునినవ్వు, పార్వతిశాపం.
వినాయక వ్రత కల్ప విధానములో వినాయకునికి గణాధిపత్యం ఎలా లభించిందీ, గణపతని చూసి నవ్విన చంద్రుడు పార్వతీదేవి శాపానికి ఎలా గురైంది ప్రస్తావించి ఉంది.
గణాధిపతి స్థానానికి వినాయకుడూ, కుమారస్వామీ పోటీ పడ్డారు. శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు - "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చెసి ముందుగా నా వద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుంది". కుమార స్వామి నెమలి వాహనంపై వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు. వినాయకుడు నారాయణ మంత్రము జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. నారములు అనగా జలములు, జలమున్నియు నారాయుణుని ఆధీనాలు. అనగా ఆ మంత్ర ఆధీనములు. మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు. వినాయకునికే ఆధిపత్యము లభించింది.
గణాధిపతియైన వినాయకుడు లోకముల పూజలు అందుకొని, సుష్టుగా భోజనం చేసి, కైలాసమునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోయాడు. కాని బొజ్జ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే, అదిచూసి చంద్రుడు పకపక నవ్వాడు. ఆ నవ్వుకు (దృష్టి దోషానికి) వినాయకుడి పొట్ట పగిలిపోయింది. కోపించిన పార్వతి "నిన్ను చూచినవారు నీలాపనిందలకు గురియగుదురు గాక" అని శపించింది. ఫలితముగా లోకమునకు చంద్రుడు నింద్యుడయినాడు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు.
లోకుల ప్రార్థనలు మన్నించిన పార్వతి 'భాద్రపద శుద్ధ చవితి' నాడు (చంద్రుడు నవ్విన నాడు) మాత్రమే ఈ శాపము వర్తిస్తుందని శాప ప్రభావాన్ని సడలించింది. ఆ ఒక్కరోజు లోకులు జాగ్రత్త పడసాగారు. 
  గణేశుని ముప్పై రెండు రూపాలు.
ప్రధానంగా గణపతుల సంఖ్య 21 (కనుకనే ఏకవింశతి పత్రపూజ చేస్తారు). ఇంకా అవాంతర భేదగణపతులు 11 - మొత్తం 32
శ్రీ గణపతి
వీర గణపతి
శక్తి గణపతి
భక్త గణపతి
బాల గణపతి
తరుణ గణపతి
ఉచ్చిష్ట గణపతి
ఉన్మత్త గణపతి
విద్యా గణపతి
దుర్గ గణపతి
విజయ గణపతి
వృత్త గణపతి
విఘ్న గణపతి
లక్ష్మీ గణపతి
నృత్య గణపతి
శక్తి గణపతి
మహా గణపతి
బీజ గణపతి
దుంఢి గణపతి
పింగళ గణపతి
హరిద్రా గణపతి
ప్రసన్న గణపతి
వాతాపి గణపతి
హేరంబ గణపతి
త్ర్యక్షర గణపతి
త్రిముఖ గణపతి
ఏకాక్షర గణపతి
వక్రతుండ గణపతి
వరసిద్ధి గణపతి
చింతామణి గణపతి
సంకష్టహర గణపతి
     32 .త్రైలోక్యమోహన గణపతి
అర్ధాంగి సమేత గణపతి పేర్లు.
సిద్ధి గణపతి భార్య పేరు సిద్ధిబుద్ధి.
లక్ష్మీగణపతి భార్య పేరు జయలక్ష్మి.
 ధూమ్ర గణపతి భార్య పేరు సిద్దలక్ష్మి.
కృష్ణ గణపతి భార్య పేరు సువర్ణా దేవి.
రక్త వర్ణ గణపతి భార్య పేరు పద్మావతి.
 సువర్ణ గణపతి భార్య పేరు రజత దేవి.
విష్ణ గణపతి భార్య పేరు ప్రజాదేవి.
నిర్విఘ్న గణపతి భార్య పేరు అతి ప్రజ్ఞాదేవి.
వికట గణపతి భార్య పేరు జ్ఞానాదేవి.
బాల చంద్ర గణపతి భార్య పేరు చంద్రముఖి.
అంబర గణపతి భార్య పేరు సంహార దేవి.
భద్ర గణపతి భార్య పేరు శాంతిదేవి. లంబోదర
శుక్ల గణపతి భార్య పేరు బుద్ధి లక్ష్మి.
ఋణ విమోచన గణపతి భార్య పేరు సౌభాగ్య లక్ష్మి. 
గణపతి భార్య పేరు లోకమాత.
లక్ష్మీప్రద గణపతి భార్య పేరు వరలక్ష్మీ.
వక్రతుండ గణపతి భార్య పేరు నవరత్న లక్ష్మి.
చింతామణి గణపతి భార్య పేరు విజయ లక్ష్మి.
 ఏకదంత గణపతి భార్య పేరు సిద్ధిలక్ష్మి.

కామెంట్‌లు