శ్రీమహా గణనాయకుడు.. గజాననుడు "కవి మిత్ర" శంకర ప్రియ., సంచార వాణి: 99127 67098

     శ్రీ మహా గణనాయక!
      సిద్ధి బుద్ధి ప్రదాయక!
      జయ విఘ్న వినాశక!
      జయ జయ వినాయక!
           ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
👌 శ్రీ మహా గణాధిపతి స్వామి.. ఏనుగు ముఖము కలవాడు. కనుక, "గజముఖుడు, కుంజరాననుడు", అని పేరులు! శ్రీస్వామివారు.. ఆరాధకు లందరికీ ... అభయమును, అభీష్ట వరములను.. అనుగ్రహించు చున్నాడు! సాధకుల శోకరూప వనమునకు దావాగ్ని వంటివాడు.. గణ నాయకుడు!
🔱 వినాయకునకు.. సర్వ మంగళ యైన గౌరీ దేవి.. తల్లి! మంగళ ప్రదాత యైన, శంకర భగవానుడు .. తండ్రి! శ్రీకాంతుడైన, మహావిష్ణు మూర్తి.. మేనమామ! సకల విజయ దాయకుడైన, కుంజరాననునకు.. మనమంతా భక్తి ప్రపత్తులతో.. ధ్యానించాలి! రెండు చేతులు జోడించి నమస్కరించాలి!
🔆పతంజలి మహర్షి.. గజాననుడగు, మహా గణాధిపతి స్వామిని; 
మంగళాచరణ శ్లోకము నందు, ఈ విధంగా ప్రార్థించారు.
 
     🚩ప్రార్థనా శ్లోకము
    శ్రీకాంతో మాతులో యస్య
    జననీ సర్వమంగళా!
   జనక: శంకరో దేవ:
   తం వందే కుంజరాననం!
         
🚩 కంద పద్యము 
    శ్రీ కాంతు మేనమామగ
    శ్రీకాత్యాయని జననిగ, శ్రీకంఠుని, యా
     కోకనదుని పితృనిగ గను
     శ్రీ కరివదనుని కొలుతును, చేమోడ్పులతో!!
    [ డా. శాస్త్రుల రఘుపతి., ]
👌వివరణ: "కోక నదుడు" అనగా పరమ శివుడు 
         🔆🪷🔆
     🚩 తేటగీతి పద్యము
    మాధవస్వామి యెవనికి మామ యగునొ
    సర్వమంగళ యెవనికి జనని యగునొ
     శంకరుడు దేవు డెవనికి జనకు డగునొ
      అట్టి కుంజర వదనున కంజలింతు. 
      [ రచన: అవధాని కోట రాజశేఖర్.,]   
      🕉️ గం గణపతయే నమః !
కామెంట్‌లు