కృష్ణయ్యా నీకు వందనం*; - ప్రభాకర్ రావు గుండవరం (మిత్రాజీ )- ఫోన్ నం.9949267638
కృష్ణా కృష్ణా వందనం 
చిన్ని కృష్ణా నీకు వందనం
ముద్దుల కృష్ణా మురిపాల కృష్ణా
గోపాల కృష్ణా వందనం 🙏

నంద నందనా వందనం
యశోదా నందన వందనం
వాసుదేవ ప్రియా వందనం
దేవకీ తనయా వందనం 🙏

పూతకి సంహార వందనం
శకటాసుర భంజన వందనం
కంస చాణుర మర్దన వందనం
బలరామ సోదరా వందనం 🙏

 మనోహర రూప వందనం
మధుర వాక్స్వరూప వందనం
సదా ఆనంద రూప వందనం
మువ్వ గోపాలా వందనం 

వేణు గాన మురళీ వందనం
గోపికా లోలా వందనం
రాధా మాధవ వందనం
ప్రియ సరస సల్లాప వందనం 🙏

సత్యా రుక్మిణి వల్లభ వందనం
నారాయణ నీకు వందనం
భగవత్ గీతా పరమాత్మ వందనం
జగద్గురువు నీకు వందనం 🙏
*********

కామెంట్‌లు