భారతీయ వీరులం
భారతమ్మ బిడ్డలం
బంధాలను ముడివేయు
అందాల బాలలం
సింధూర పూవులం
మందార మాలలం
అందరికీ ఇష్టులం
చందమామ మిత్రులం
కొంగ్రొత్త చిగురులం
కరుణ గల పిల్లలం
కల్మషం కనిపించని
కడిగిన ముత్యాలం
స్నేహానికి గురుతులం
ప్రకృతి ఆరాధకులం
తోటలోని మొక్కలం
ఆటల ప్రేమికులం
బుద్ధిలోన అధికులం
శుద్ధమైన హృదయులం
ముద్దులొలుకు బాలలం
వృద్ధికి మేం బాటలం
లేలేత మొగ్గలం
లేడిపిల్ల పరుగులం
లేశము ఈసులేని
రోషమున్న పిల్లలం
బడికెళ్లు బాలలం
నడిరేయి చంద్రులం
గుడిలోని గంటలం
మడిలోని పంటలం
ఇంటాబయట అంతట
మేముంటే కళకళ
లేకుంటే లోకము
పోతుంది వెలవెల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి