పక్షుల ప్రబోధం- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580.
నమ్మకూడదు పుకారు
శీఘ్రమే చేయు షికారు
మరో పేరే వదంతి
దోచునది మనశ్శాంతి

చెరుపును చెప్పుడు మాటలు 
వింటే బ్రతుకున నిప్పులు
ఉండుము వాటికి దూరము
లేదా జరుగును ఘోరము

మూర్ఖులతో సహవాసము
జీవితాన వనవాసము
కోపగుణం వినాశనము
వదిలిపెడితే క్షేమము

మదిలో కుంపటి కలతలు
కలచివేయును మనసులు
తరిమికొడితే లాభము
లేకపోతే కష్టము


కామెంట్‌లు