పసి పిల్లలు;- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580.
 ఆ.వె:
పిల్లల మది చూడ చల్లని హిమగిరి
మల్లె పూల తావి పల్లె సీమ
కొల్లగొట్టు పలుకు వల్లిలా మెత్తన
తెల్లని నెలవంక  తల్లి  వొడిని

కామెంట్‌లు