అమ్మాయిగా పుడితే?;- భోజన్నగారి అనసూయ- నిజామాబాద్.99898 22494.

 మా అమ్మ, అమ్మమ్మ
నేను పుట్టినప్పుడు అన్నారట 
దేవుడా!మళ్లీ అమ్మాయినిచ్చావ
రోజు రోజు ఆంక్షలు, అణకువలు.          
 ఏ రోజూ నవ్వులే లేవు
అమ్మ భయం ఏ ఆపద వస్తుందోనని
నాన్న భయం కట్నం కూడబెట్టాలని
ప్రతి దానికి లెక్కలతోనే  లెక్క
పుస్తకాల ముచ్చట ఉండదు
దోస్తులు ఉండకూడదు
పక్కింట్లో ఉన్నా నీ అత్త ఇల్లా! దీర్ఘాలు
మార్కులు ఎక్కువొచ్చినా భయం
తక్కువైతే ఇంకా పెత్తనం
చాపకింద నీరులా అన్నివైపులా
అన్నింటా,అమ్మ ఇంట, అత్త ఇంటా!
          

కామెంట్‌లు