నిలువెత్తు నిజాయితీ (మొగ్గలు);- ఎం. వి. ఉమాదేవి.
తెలుగుభాషా ప్రేమికునిగా అనుభూతి చెందుతూనే
పరభాష బానిసత్వం ఎందుకని ప్రశ్నించాడు!
కాళోజీ జీవితం నిత్య అనుసరణీయం!

నిరాడంబర వ్యక్తిత్వం సమాజం కోసమనే
పాలకులకూ ప్రజలకి మధ్య వారధయ్యాడు!
కాళన్న కాలాన్ని జయించిన కవివర్యులు!

ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే
ప్రభుత్వకార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేశాడు!
భుజానికి సంచీలో సమస్యల కట్టలు!!

నా గొడవ ఇదంటూ ఎలుగెత్తుతూనే
మాండాలిక యాసకు మహిమ చేకూర్చాడు!
కాళోజీ రచనలు ప్రతికవికి ఆదర్శం!!


కామెంట్‌లు