నాడు అద్దంలో చందమామ;- ఎడ్ల లక్ష్మి
పాప ఏడుపు విని అమ్మ
పాల బువ్వ కలిపింది
గోరు ముద్దలు పెట్టింది
పాపా నోరు మూసింది !

అమ్మ చూసి నవ్వింది
పాపను నోరిప్పు మంది
మారం చేస్తూ ఆ పాప
చందమామనడిగింది!

అచ్చటికవ్వ వచ్చింది
పాప మాటలు విన్నాది
అద్దం ఒకటి తెచ్చింది
పాప ముందు పెట్టింది!

అందులోనా చందమామ
వెన్న ముద్దలా కనిపిస్తుంది
పాప అద్దం పట్టింది
చెయ్యి పెట్టి పునికింది!

వెన్నెలను చూసి పాపాయి
కిలకిలమని నవ్వుతూ
గోరుముద్దలు మింగింది
హాయిగా నిద్ర పోయింది!


కామెంట్‌లు