గురువు- కొప్పరపు తాయారు
అమ్మ ఆకారం ఇచ్చింది
గురువు గుర్తింపు ఇచ్చాడు
అమ్మ అన్నం ముద్దలు పెట్టింది
గురువు అక్షర జ్ఞానంతో నింపె

అమ్మ నడక నేర్పే
గురు గుర్తింపు నిచ్చే
నడిపించే సంఘజీవిగా
అమ్మ నవ్వులు పంచింది

గురువు ఆశయాలతో పాటు
అనుభవాలు నేర్పే
అమ్మ మంచి నేర్పే
గురువు గౌరవించడం నేర్పే

అమ్మ ఆనందించడం నేర్పే
గుర్తింపు తెచ్చుకునే జీవితాన్నిచ్చే
అమ్మ ఆది, గురువు సర్వస్వం !!

గురుమూర్తిలందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు!!!

కామెంట్‌లు