న్యాయాలు -262
వృశ్చిక వానర న్యాయము
***************
వృశ్చికము అంటే తేలు.వానరము అంటే కోతి.
వృశ్చిక వానరము అంటే అసలే కోతి ఆపై తేలు కుట్టినట్లు అని అర్థంతో తీసుకోబడింది.
కోతి ఏ ఒక్క చోట ఒక్క క్షణం కూడా నిలకడగా ఉండదు.చెట్టుకున్న ఒక కొమ్మ నుండి మరో కొమ్మ పైకి అలా దూకుతూనే వుంటుంది. ఆ కొమ్మలను పట్టుకొని ఊగుతూ కూడా ఉంటుంది.
అలాంటి కోతికి కల్లు ముంత దొరికింది. నీళ్ళు అనుకుని ఎంచక్కా తాగేసింది. కల్లు ఏం చేస్తుంది. ఎంత నిలకడగా ఉన్న మనిషినైనా నియంత్రణ తప్పేలా చేస్తుంది కదా.
మరి ఒక్క క్షణం కూడా కుదురుగా వుండని కోతి తాగింది. ఇక అది తాగిన తర్వాత దాని ప్రభావంతో పిచ్ఛి పిచ్చిగా గంతులు వేయసాగింది.
అలాంటి సమయంలో పొరపాటున తేలును తొక్కింది. అది కాస్తా కోపంతో చటుక్కున కుట్టేసింది.
అసలే ఓ వైపు తాగిన మైకం. మరోవైపు తేలుకుట్టిన బాధ. ఆ స్థితిలో కోతి చేసే చేష్టలు ఎంత పిచ్చిగా, హానికరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.
"ఇది అందరికీ తెలిసిన విషయమే కదా! ఇదో న్యాయమా? అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరముందా? అనిపించ వచ్చు.
కానీ చెప్పుకోవాలి ఎందుకంటే మన పెద్దవాళ్ళు జ్ఞానులు. వాళ్ళు తమ అనుభవాల ద్వారా తెలుసుకున్నారు కాబట్టే మనసును కోతితో పోల్చి చెప్పారు.
మనిషి యొక్క ప్రధాన శత్రువు మనసే అని కూడా చెప్పారు పెద్దలు .అది అక్షర సత్యం కదా!. "సంకల్ప వికల్పాత్మకం మనః"అని శాస్త్రం కూడా చెబుతోంది.మనసు ఓకే ఆలోచనపై ఎప్పుడూ స్థిరంగా ఉండదు. తనకు సంబంధించిన దాని చుట్టే కాకుండా సంబంధం లేని వాటి చుట్టూ బొంగరంలా తిరుగుతుంది.అలాగే అయినది,కానిదని తేడా లేకుండా అనేక విషయాల చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. అవసరం లేని,ఉపయోగపడని ఆలోచనలు ఎన్నో చేస్తూ వుంటుంది.
అందుకే స్వామి వివేకానందుడు మనసును అదుపులో పెట్టుకోవడం చాలా కష్టమని, దానిని పిచ్ఛి కోతితో పోల్చారు.
కోతి లాంటి చంచలమైన మనసు ఉన్న వ్యక్తి ఎప్పుడూ తీరని కోరికలతో అశాంతిగానే వుంటాడనీ.
అలాంటి వ్యక్తి ఇక తీరని కోరికల మద్యాన్ని తాగితే. ఇక అతడిలో నిలకడ అనేది వుండదనీ,. దానికి తోడు అసూయ అనే తేలు కుడితే.ఇక ఆ మనిషి మనస్సులో అహంకారం అనే రాక్షసుడు ప్రవేశిస్తాడనీ,ఇక అలాంటి వ్యక్తి మనస్సును అదుపు చేయడం ఎంతో కష్టమని అంటారు.
కోతి జంతువు కాబట్టి ఫరవాలేదు. మనం మనుషులం కదా!
మనసును నిలకడగా ఉంచుకోకుండా వ్యర్థమైన ఆలోచనలు చేయకూడదనీ,అసూయ ద్వేషాలనే తేలు కుట్టించుకుని ఇంగిత జ్ఞానాన్ని మరిచి పోవద్దని చెబుతోంది.ఈ "వృశ్చిక వానర న్యాయము.
అలా మనసును అదుపులో ఉంచుకోకపోతే మనిషిగా వ్యక్తిత్వ హీనుడు అవుతాడు ." కాబట్టి అందులోని అంతరార్థాన్ని గ్రహించి మనసును అదుపులో పెట్టుకొని ప్రశాంత చిత్తంతో వున్న వారికే సమాజంలో గౌరవ మర్యాదలు అందుతాయనేది ప్రతి క్షణం గమనంలో ఉంచుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి