చందమామ అందిన రోజు..!";- కోరాడ నరసింహా రావు
🙏🌷ఘన విజయం 💐👏
        * చంద్రయాన్. 3.*
   
         *************
చందమామ  రావే.. 
  జాబిల్లి రావే... ! అని పాడు కునే.. ఆ చందమామ తెల్లదనం చల్లదనం... సూర్యకిరణాల పరివర్తనతో, కేవలం మన ఈ భూమికి మాత్రమే... !!

ఆ చంద్రుని సమగ్ర విషయ విశేషాలను కనుగొన చంద్రయాన్, 2.ప్రయోగం  నిరాశ పరచిందని నిష్క్రమించక... రెట్టించిన పట్టుదలకు నిదర్శనమె .... 
 * ఈ చంద్రయాన్. 3 *

ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాoత శ్రమ ఫలించింది !

ఆర్బిటర్ సామర్ధ్యాన్ని 7.సంవత్స రాలకు పెంచుకుని 
 విక్రమ్ లాండర్, చంద్రుని దక్షిణ ధృవం పై... 
  విజయవంతంగా చేరి నిలిచింది 
  23.aug.2023.న భారత్, లేజర్ టెక్నాలజీ తో చంద్రునిపై వంద కిలోమీటర్ ల త్రివర్ణ విజయకేతనాన్ని రేప - రెప లాడించి... ప్రపంచదేశాల ప్రశంసల నందుకుంది... !

అతి తక్కువ వ్యయం తో.... సాధించిన ఘన విజయం... 
 వెయ్యి బిలియన్ డాలర్ ల ఆర్డర్ లను తెచ్చి పెట్టింది !

ప్రపంచాన మనవిజయకేతనం సగర్వంగా ఎగురు తున్నది !

దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత పరిపుష్టం కాబోతున్నది !

ఎవ్వరికీ అందని ఆ చందమామ మనకే అందిన ఈ రోజు,యావత్భారతానికీ...ఆనందోత్సాహాల  పండుగ రోజే..!

హాట్సాఫ్... శివన్...
    జయహో... భారత్... 

కామెంట్‌లు