సంపూర్ణ సాహిత్య కదంబం;- ..అచ్యుతుని రాజ్యశ్రీ
తెలుగింటి బీద బ్రాహ్మణ కుటుంబంలో జనియించి
రాజసం ఉట్టిపడే తలపాగా తో
రాష్ట్రపతిగా రాణించి
బ్రతకలేక బడిపంతులు కాదు
బ్రతుకులు తీర్చిదిద్దే ఉపాధ్యాయులు అన్నావు
రాధాకృష్ణుని జన్మదినం
అధ్యాపకులు విద్యార్థులకు
ఆత్మ పరిశీలన ఆత్మీయత పెంచు పంచు పోషించు

నర్సరీ లో చేరి అంచెలంచెలుగా ఎదిగిన డాక్టర్ లాయర్ ఇంజనీర్ ప్రొఫెసర్
కానీ తాను మాత్రం జీవితాంతం టీచర్ ప్రీచర్ 

సూర్యుని దగ్గర హనుమ శిష్యరికం
రాకుమారుల గురుకుల వాసం
లఘువులైన ఇసుక రేణువుల
గురువు గా మార్చి చిందించు మందహాసం
వారిఉన్నతిలో ఆనందం పొందే
అధ్యాపకులే మూలధనం
.. స్వస్తి..

కామెంట్‌లు