వెన్నెల వెలుగులో నీడల ఆటలు;- ఎడ్ల లక్ష్మి
అంద మైనా పిల్లల్లారా
ఆటలు ఆడే పాపల్లారా
పాటలు పాడే బాలుల్లారా
ఆట పాటలు మీ సొంతం!

నిండు పున్నమి నేడండి
పండు వెన్నెల వెలుగండి
పిల్లలు అందరు రారండి
వెన్నెల వెలుగు చూడండి!

వెలుగులో ఆటలు ఆడండి
మీ నీడ తోడు వస్తుంది
పరుగుల నీడను పట్టండి
అడుగులు వేసి తొక్కడండి!

మీ నీడ దొరికితే దొంగలు
దొరకకుండా చూడండి 
సూరు కిందకి చేరండి
ఆటలు మీరు గెలవండి!


కామెంట్‌లు