సుప్రభాత కవిత - బృంద
నీలాల నింగిలోన
మేఘాల బాలలు
నినదించు నాదం
రవికి స్వాగతగీతం

వేకువకై  అపేక్షగా
వేయికళ్ళ నిరీక్షణ 
తూరుపున రంగుల
రంగవల్లుల అలంకరణ

తెలతెల వారుతుండగా
తేట తేట  కిరణాలతో
తెలివెలుగులు చిమ్ముతూ
తొంగి చూచు బాలుడు

జగమంతా పరచుకున్న
జలతారు బంగరు కాంతి
జనులంత తిలకించి
ధన్యతనొందువేళ...

మానసమందలి మమతలు
తలపులలో కదిలి కన్నుల మెదిలి
పెదవులపై మందహాసము
ముఖమంత అలముకుని

కొత్త చైతన్యము కలిగి
కొదవలన్నీ మరిచి
కోరిన తీరం చేరే కోరిక
కొండలా అచలమవగా

కొత్త జీవికనిచ్చు కొంగొత్త
వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు