పాతనూకల రామతిలకం .;- డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 ఆంధ్ర నాటక పితామహులు ధర్మవరం రామకృష్ణాచార్యులవారు పద్యాలను,గేయాలను నాటక రచనలలో ప్రవేశపెట్టారు. పద్యనాటక రచనలలో తదనంతర రచయితలకు మార్గదర్మకులుగా నిలిచారు. ధర్మవరంవారి"చిత్రనళినీయం" వడ్డాదిసుబ్బరాయకవి వారి రచన "వేణిసంహారం"చిలకమర్తివారి"గయోపాఖ్యానం" పానుగంటివారి "పాదుకాపట్టాభిషేకం "ముత్తరాజువారి" "శ్రీకృష్ణతులాభారం" బలిజేపల్లివారి "సత్యహరిశ్చంద్ర" తిరుపతి వేంకటకవుల "పాండవోద్యోగవిజయాలు" వంటిపలు పద్యనాటకాలు ఎంతోప్రఖ్యాతిచెంది వేలప్రదర్మనలకు నోచుకున్నాయి.
తెలుగునాటకరంగంలో నాడు స్త్రీపాత్రలు పురుషులే ధరిస్తుండేవారు.స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలని ప్రముఖ నాటక కళాకారుడు బళ్ళారి రాఘవా ఎంతగానో కృషిచేసారు. అలా నాటకరంగంలో ప్రవేసించిన కన్నాంబ, కొటిరత్నం,ఋష్యేంద్రమణి, లక్ష్మిరాజ్యం, ఆవేటిపూర్ణిమ, కొమ్మూరి పద్మావతి (ప్రముఖ రచయిత కొమ్మురి సాంబశివరావుగారి అమ్మగారు )రామతిలకం వంటి పలువురు కళాకారులు వేదికపై రాణించారు.
నాడు సురభి వారి నాటకాల్లోనూ, గుంటూరు దంటూ వెంకట కృష్ణయ్య గారి" నవలా నాటక సమాజం" లోనూ, విశాఖపట్నంమారేపల్లి రామచంద్రశాస్త్రిగారి "సంగీతమానిని"నాటక సమాజంలోనూ ఎంతోమంది నటించి పేరుపొందారు.
పాతనూకలరామతిలకం ఇటునాటక రంగంలోనూ అటుసినిమా రంగం లోనూ పేరుగడించారు. విజయవాడలోని "మైలవరంబాలభారతి" సమాజంద్వారా కళారంగానికి పరిచయంచేయబడి ఆసంస్ఢలో రామనాధశాస్త్రిగారితోకలసి సంచార నాటకాలు దేశం అంతటా ప్రదర్మించారు. కొంతకాలం తరువాత పులిపాటివెంకటేశ్వర్లుతొకలసి పలు ప్రదర్మనలుయిచ్చారు.
విశాఖపట్టణానికి చెందిన బాకురాపాండవెంకట్రావు నటుడు,గాయకుడు, హార్మోనిస్టుగా నాటకసమాజ నిర్వాహకుడిగా మంచి పేరుఉండేది. అలాకొందరు నాటక రంగకళాకారులను బొంబాయి తీసుకువెళ్ళి సాగర్ మూవిటోన్ అనే సిని నిర్మాణ సంస్ధస్ధాపించి"శ్రీరామపాదుకాపట్టాభిషేకం" అనేచిత్రంనిర్మించారు. జనవరి1932 లోవిడుదలైన ఈచిత్రంలో శ్రీరాముడిగా యడవల్లిసూర్యనారాయణ,సీతగా సురభికమలాబాయి నటించారు.ఈచిత్రంద్వారానే రామతిలకం సినిరంగానికి పరిచయం చేయబడ్డారు.1933 లో కాళ్ళకూరి సదాశివరావు గారు తనతండ్రిరాసిన "చింతామణి" నాటకాన్ని సినిమాగా కలకత్తలో రాధాకిషన్ చామ్రియా సహాకారంతోమదన్ పిక్చెర్స్ పేరిట రామతిలకం చింతామణిగా,ఎస్ .డి.బాబురావు కృష్ణుడుగా, పులిపాటివెంకటేశ్వర్లు భవానిశంకరుడుగా నటించారు. అదేసంవత్సరం ఈస్ట్ ఇండియాకంపెనివారు సి.పుల్లయ్య దర్మకత్వంలో తొలిటాకిచిత్రం"సతిసావిత్రి" నిర్మించారు. వేమూరిగగ్గయ్య ఈచిత్రంద్వార యమధర్మరాజు పాత్రలో పరిచయం చేయబడ్డారు. సతీసావిత్రి పాత్రను రామతిలకం పోషించారు.1934 లో "సీతాకళ్యాణం" లోనూ,1935 వేల్ పిక్చెర్స్ వారు"కృష్ణలీలలు"చిత్రంనిర్మించారు. ఈచిత్రంలో ప్రముఖ సంగీత దర్మకుడు సాలూరి రాజేశ్వరరావు గారు బాలకృష్ణుడుగాపరిచయంచేయబడ్డాడు,రామతిలకం యశోదగా, కంసుడిగా గగ్గయ్య, పారుపల్లిసుబ్బారావు వసుదేవుడిగా, అరెకపూడి లక్ష్మిపెరుమళ్ళు నందుడిగా,శ్రీరంజని దేవకిదేవిగా నటించారు.ఈచిత్రం1 జూలై 1935 నవిడుదల జరిగింది.
1936లోశ్రీ రామాఫిలింస్ వారి"సతితులసి"చిత్రం లో తులసిపాత్ర రామతిలకం పోషించారు.ఇదేసంవత్సరం "ద్రౌపతివస్త్రాపహరణం"చిత్రంలో రామతిలకం సత్యభామగా నటించగా,సి.యస్ .ఆర్. శ్రీకృష్ణుని పాత్రలో సినిరంగానికి పరిచయంచేయబడ్డారు.1937లో నేషనల్ మూవిటోన్ వారు తాపి ధర్మారావుగారి తొలిరచన"మోహినిరుక్మాగద"సినిమాగా నిర్మించగా మోహిని పాత్ర రామతిలకం పోషించారు.యిలా పలు చిత్రాలలోనటించి ఇటు నాటకరంగానికి అటు సినిమారంగానికి వన్నెతెచ్చినకళారత్నం రామతిలకం. తన ముపైఅయిదో ఏట విజయవాడలో శాశ్వితనిద్రలో ఒరిగిపోయారు.

కామెంట్‌లు